దిల్‌ రాజు ప్లస్‌ అతను తప్ప ఇంకో దిక్కు లేదు!

దిల్‌ రాజు ప్లస్‌ అతను తప్ప ఇంకో దిక్కు లేదు!

నైజాం ఏరియాలో ఇప్పుడు ఇద్దరే ఇద్దరు టాప్‌ డిస్ట్రిబ్యూటర్లు వున్నారు. గతంలో చాలా మంది పంపిణీదారులు వుండేవారు కానీ వాళ్లంతా ఇప్పుడు కనుమరుగు అయిపోయారు. వ్యాపారంలో తీవ్ర నష్టం రావడంతో పలువురు పంపిణీదారులు వేరే రంగాల్లోకి వెళ్లిపోయారు. దీంతో నైజాంకి ఇప్పుడు ప్రధానంగా ఇద్దరే పంపిణీదారులు మిగిలారు. ఒకరు దిల్‌ రాజు కాగా, మరొకరు ఏషియన్‌ సినిమాస్‌ సునీల్‌.

నైజాంలో ఏ సినిమా కొనాలన్నా కానీ వీరిద్దరే కొనాలి. దీంతో వీరు నెలల వారీగా విభజించుకుని మరీ సినిమాల హక్కులు తీసుకుంటున్నారు. ఇద్దరూ ఒక మాట అనుకుని రేట్‌ ఫిక్స్‌ చేయడం వల్ల వీళ్లు చెప్పిందే వేదం అయిపోతోందట. నిర్మాతలు ఎక్కువ ఆశించినా కానీ వీరు చెప్పిన రేటు కాకుండా ఎక్కువ ఇవ్వడానికి మరో డిస్ట్రిబ్యూటర్‌ దొరకడం లేదట. దాంతో వీళ్లెంత చెప్తే అంతకే అమ్మాల్సి వస్తోందట. గతంలో డిస్ట్రిబ్యూటర్‌కి రిస్కు ఎక్కువైన ఎన్‌ఆర్‌ఏ పద్ధతిలో లావాదేవీలు జరిగేవి.

కానీ ఇప్పుడు నిర్మాతకి ఎక్కువ రిస్క్‌ అయిన అడ్వాన్స్‌ పద్ధతిలోనే రైట్స్‌ తీసుకుంటున్నారు. పెద్ద సినిమాలకి కూడా వీళ్లు చెప్పినట్టే బిజినెస్‌ చేయాల్సి వస్తోంది లేదా సొంతంగా విడుదల చేసుకోవాలి. ఆ టైమ్‌లో కనుక వేరే చిత్రమేదైనా విడుదలైతే ఇక సొంతంగా విడుదల చేసిన వారికి థియేటర్లు దొరకవు. ఇంతగా తమ చెప్పుచేతల్లో నైజాం మార్కెట్‌ని పెట్టుకుని ఇండస్ట్రీని ఈ ఇద్దరూ ఏలేస్తున్నారని భోగట్టా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English