మహేష్‌తో రిలేషన్‌ గురించి తారక్‌

మహేష్‌తో రిలేషన్‌ గురించి తారక్‌

ఇద్దరు స్టార్‌ హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవుతూ వుండేసరికి సోషల్‌ మీడియాలో ఫాన్‌ వార్స్‌ తారాస్థాయిలో వున్నాయి. మహేష్‌, ఎన్టీఆర్‌ అభిమానుల మధ్య ట్వీట్‌ వార్స్‌, ట్రోల్‌ వార్స్‌ నడుస్తున్నాయి. అభిమానులు ఇలా హీరోల కోసం కొట్టుకుంటూ వుంటే, అటు హీరోలు మాత్రం స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నారు.

తన సినిమా విజయవంతమైందన్నపుడు మహేష్‌ కాల్‌ చేసి అభినందనలు చెబుతాడని, అలాగే తన సినిమా బాగుంటే తనకీ కంగ్రాట్స్‌ చెబుతానని, జనతా గ్యారేజ్‌కి మహేష్‌ తనకి కాల్‌ చేస్తే, శ్రీమంతుడు టైమ్‌లో తను మహేష్‌తో మాట్లాడానని, బిజీగా వుండడం వల్ల తరచుగా మాట్లాడుకోకపోయినా కానీ ఇద్దరి మధ్య సత్సంబంధాలు, స్నేహం వున్నాయని ఎన్టీఆర్‌ చెప్పాడు. ఒకేసారి స్పైడర్‌, జై లవకుశ విడుదలవడం పట్ల ఎన్టీఆర్‌ ఏమీ టెన్షన్‌గా లేడు. సినిమాలు బాగుంటే ఎన్ని వచ్చినా ఆడతాయని, సంక్రాంతికి మూడు సినిమాలు విడుదలై మూడూ ఘన విజయం సాధించిన సంగతిని గుర్తు చేసాడు.

స్పైడర్‌తో తమిళ మార్కెట్‌లో అడుగుపెడుతోన్న మహేష్‌కి శుభాకాంక్షలు చెప్పిన ఎన్టీఆర్‌, తనకి మాత్రం పరభాషకి వెళ్లే ఆలోచన ప్రస్తుతానికి లేదని చెప్పాడు. ఇక్కడ ఇంకా తాను చేయాలని ఎదురు చూస్తోన్న పాత్రలు చాలా వున్నాయని తారక్‌ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు