వారసత్వంపై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

వారసత్వంపై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో ఎటు చూసిన వారసులే కనిపిస్తారు. కొంచెం పేరున్న హీరోల జాబితా తీస్తే దాదాపు 80 శాతం వారసత్వం ఉన్న వాళ్లే కనిపిస్తారు. ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో వారసుల హవా బాగా పెరిగింది. సినీ కుటుంబాలకు చెందిన కుర్రాళ్లందరూ హీరోలు కావడానికే తహతహలాడిపోతున్నారు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై సినీ పరిశ్రమకు చెందిన ఎవరినీ కదిపినా.. నో కామెంట్ అనేసి సమాధానం దాటవేసేస్తారు. ఐతే ఎన్టీఆర్ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ.. హీరోగా మారి.. మంచి పేరు, స్థాయి అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఫిలిం ఇండస్ట్రీలో వారసత్వంపై ఓపెనయ్యాడు. తన అభిప్రాయాలు చెప్పాడు.

ఎన్టీఆర్ వారసత్వాన్ని ముందు తీసుకెళ్తున్నామని అనుకుంటున్నారా అని తారక్‌ను అడిగితే.. ‘‘ముందు నేను వారసత్వాన్ని నమ్మను. హీరో కావడానికి వారసత్వం అర్హత కాదని నా ఫీలింగ్. నేను హీరో కాబట్టి రేపు కచ్చితంగా నా కొడుకు అభయ్‌ రామ్‌ కూడా హీరో కావాలంటే కుదరదు. సినిమా వాతావరణంలో పెరగడం వల్ల తను సహజంగా ఈ రంగం పట్ల ఆకర్షితుడు కావొచ్చు. అంతే తప్ప నేను మాత్రం అభయ్‌ను ఈ రంగంలోకి రావాలని బలవంతం చేయను. మా అమ్మానాన్నలు కూడా నన్ను హీరో అవ్వమని ఫోర్స్ చేయలేదు. హీరో అవ్వాలని నాకు అనిపించింది. అయ్యాను. మన పరిశ్రమలో 25 నుంచి 30 మంది దాకా పేరున్న హీరోలున్నారు. అందరికీ వారసత్వం ఉందా? ప్రతిభే ఇక్కడ మాట్లాడుతుంది. నేను దాన్నే నమ్ముతా’’ అని ఎన్టీఆర్ అన్నాడు.

నేను టీచర్‌ని కాదు!
‘మీరు ఇంత బాగా నటిస్తారు కదా! టిప్స్‌ చెప్పండి’ అని నన్ను చాలామంది చాలాసార్లు అడిగారు. నేను టీచర్‌ని కాదు, ఇంకా లెర్నర్నే. ఎవరికైనా ఎలా నటించాలో మనం ఎలా చెప్పలగం? అసలు, ‘ఎవరైనా మొదటిసారి ఎప్పుడు నటించుంటారో తెలుసా?’ ఒక్కసారి ఆలోచించండి. తల్లితండ్రులకు అబద్ధం చెప్పినప్పుడు. ‘లేటుగా వచ్చావేంటి?’ అని ఇంట్లో అడగ్గానే...  ఈ సిట్యువేషన్‌ లోంచి ఎలాగైనా బయటపడాలని అబద్ధాన్ని ఎంతో అందంగా చెబుతాం కదా. నటనంటే అదేనని నా ఫీలింగ్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు