ఎన్టీఆర్ దృష్టిలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు?

ఎన్టీఆర్ దృష్టిలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు?

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యుత్తమ డ్యాన్సర్లలో ఎన్టీఆర్ ఒకడు. చిరంజీవి తర్వాత ఈ తరంలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరంటే అతడి పేరు చర్చకు వస్తుంది. మోడ్రన్ డ్యాన్సులే కాదు.. శాస్త్రీయ నృత్యం చేయమన్నా అదరగొట్టేస్తాడు ఎన్టీఆర్. మరి అంత మంచి డ్యాన్సరైన ఎన్టీఆర్‌ను.. తెలుగులో మీకు నచ్చిన డ్యాన్సర్ ఎవరు అంటే ఏం సమాధానం చెప్పాడో తెలుసా.. ‘బన్నీ’ అని.

ఓ టీవీ ఛానెల్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో భాగంగా ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగులో తనకు నచ్చిన డ్యాన్సర్ బన్నీనే అని చెప్పాడు. ఏ మొహమాటం లేకుండా తనకు సమవుజ్జీ అయిన, పోటీదారు అయిన బన్నీ పేరును ఎన్టీఆర్ చెప్పడం ఆసక్తి రేకెత్తించేదే.

మరోవైపు మహేష్ బాబు సినిమా ‘స్పైడర్’.. తమ ‘జై లవకుశ’కు పోటీగా వస్తుండటంపైనా ఎన్టీఆర్ పాజిటివ్ కామెంట్స్ చేశాడు. దాన్ని పోటీగా భావించట్లేదని.. ఆ సినిమా కూడా బాగా ఆడాలని.. అన్ని సినిమాలూ మంచి ఫలితాన్నందుకోవాలని ఆకాంక్షించాడు.

మరోవైపు పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రం గురించి కూడా ఎన్టీఆర్ స్పందించడం విశేషం. పవన్ కళ్యాణ్‌ను మీరు సపోర్ట్ చేస్తారా.. మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే.. ‘‘దాని మీద నేను నా అభిప్రాయం చెప్పే స్థితిలో లేను. నేనొక సాధారణ పౌరుడిని. అలాంటి పౌరుడిగా ప్రతి రాజకీయ పార్టీ ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటాను’’ అంటూ డిప్లమేటిక్ ఆన్సర్ ఇచ్చాడు ఎన్టీఆర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు