ఆ బేనర్ ఎందుకో చెప్పిన అల్లు అరవింద్

ఆ బేనర్ ఎందుకో చెప్పిన అల్లు అరవింద్

గీతా ఆర్ట్స్ లాంటి లెజెండరీ బేనర్ ఉంది అల్లు అరవింద్ ఫ్యామిలీకి. ఇది కాక 'గీతా ఆర్ట్స్-2' అంటూ ఇంకో బేనర్ కూడా మొదలుపెట్టి రెండు మూడు సినిమాలు తీశాడాయన. ఇవి రెండూ చాలవన్నట్లుగా ఇప్పుడు బన్నీ వాసు.. జ్నానవేల్ రాజా.. యువి క్రియేషన్స్ వాళ్లతో కలిసి 'వి-4' క్రియేషన్స్ అంటూ కొత్త బేనర్ మొదలుపెట్టాడు.

ఇది ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది అందరినీ. ఈ బేనర్ మీద తొలిసారి తెరకెక్కిన చిత్రం 'నెక్స్ట్ నువ్వే'. ఇక ముందూ ఈ బేనర్ మీద వరుసగా సినిమాలు నిర్మిస్తామని అంటున్నారు అరవింద్. ఐతే ప్రత్యేకంగా ఈ బేనర్ పెట్టడానికి కారణమేంటన్నది ఆయన వివరించారు.

''తెలుగులో చాలామంది సీనియర్ నిర్మాతలు తమ మాటే కరెక్ట్.. మిగతా వాళ్లకు ఏమీ తెలియదన్న భావనకు రావడం వల్లే రిటైరైపోయారు. నేను ఇంకా ఇక్కడ ఉంటూ సినిమాలు తీస్తున్నానంటే.. నా చుట్టూ యూత్ ఉండటం వల్లే. వాళ్లతో తరచుగా మాట్లాడుతూ.. వాళ్ల ఆలోచనలు పంచుకుంటూ నిత్య నూతనంగా ఉండే ప్రయత్నం చేస్తున్నా. అందులో భాగంగానే 'వి-4' క్రియేషన్స్ మొదలుపెట్టా.

ఇండస్ట్రీలో ఎవరు కొత్త ఆలోచనతో ఉన్నా.. ఇక్కడికి రావచ్చు. కానీ పాపర్ థాట్స్‌తో, స్క్రిప్టుతో రావాలి. మీరు అలాంటి కొత్త ఆలోచనలతో వస్తే 'వి-4'లో మీరొకరు అవుతారు. మీకు మా పూర్తి సహకారం, ప్రోత్సాహం ఉంటుంది. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడం కోసమే పెట్టిన బేనర్ ఇది'' అని అరవింద్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు