ల‌వ్వ‌ర్ బ‌ర్త్ డేను అలా సెల‌బ్రేట్ చేసింద‌ట‌

ల‌వ్వ‌ర్ బ‌ర్త్ డేను అలా సెల‌బ్రేట్ చేసింద‌ట‌

హీరోయిన్లు ఎంత‌మంది ఉన్నా.. న‌య‌న‌తార తీరే వేరు. సినిమాల‌కు సంబంధించిన వార్త‌ల్లో ఎంత త‌ర‌చూ క‌నిపిస్తుంటారో అంత‌కు మించి గాసిప్ వార్త‌ల్లో క‌నిపిస్తారు. వ‌రుస ప్రేమాయ‌ణాలు.. బ్రేక‌ప్ ల‌తో న‌య‌న వార్త‌ల్లో ఏదో ర‌కంగా ఉంటూనే ఉంటారు.తాజాగా ద‌ర్శ‌కుడు విఘ్నేశ్ శివ‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో న‌య‌న‌తార ఉన్న సంగ‌తి తెలిసిందే.

టాలీవుడ్‌.. కోలీవుడ్ ల‌లో ఎంతోమంది సెల‌బ్రిటీలున్నా.. వారిలో కొంద‌రి ప్రేమక‌థ‌లు తెలిసినా.. న‌య‌న‌తార మార్క్ మాత్రం క‌నిపించ‌దు. ఆ మ‌ధ్య‌న ల‌వ్వ‌ర్ కు ఖ‌రీదైన బీఎండబ్ల్యూకారును గిఫ్ట్ గా ఇచ్చిన‌ట్లుగా ప్ర‌చారం సాగింది. నానూరౌడీస్ చిత్ర షూటింగ్ స‌మ‌యంలో వీరి మ‌ధ్య ప్రేమ చిగురించిన‌ట్లుగా చెబుతారు.

తాజాగా విఘ్నేశ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా న‌య‌న‌తార భారీగా ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అమెరికాలోని న్యూయార్క్ మ‌హాన‌గ‌రంలో ల‌వ్వ‌ర్ బ‌ర్త్ డే వేడుక‌ల్ని గ్రాండ్ గా నిర్వ‌హించిన‌ట్లు చెబుతున్నారు. న్యూయార్క్ లోని బ్రీక్లిన్ బ్రిడ్జ్ పై ఈ జంట దిగిన ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌డావుడి చేస్తోంది.

విఘ్నేశ్ శివ‌తో న‌య‌న‌తార స‌హ‌జీవ‌నం చేస్తున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చిన వేళ‌.. తాజా అమెరికా ట్రిప్ చూస్తుంటే.. వీరి మ‌ధ్య బంధం అంత‌కంత‌కూ మ‌రింత ముదురుతోంద‌న్న‌ట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు