‘మిస్టర్ పర్ఫెక్ట్’ కాపీ ఆరోపణలై స్పందించారు

 ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కాపీ ఆరోపణలై స్పందించారు

ఎప్పుడో ఆరేళ్ల కిందట విడుదలైన సినిమా ‘మిస్టర్ పర్ఫెక్ట్’. ఈ సినిమాపై ఇప్పుడు కాపీ ఆరోపణలు రావడం.. శ్యామలా రాణి అనే రచయిత్రి తన ‘నా మనసు కోరింది నిన్నే’ నవల ఆధారంగానే ఈ సినిమా తీశారంటూ ఆరోపణలు చేస్తూ కేసు పెట్టడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఈ కేసు విషయమై ఆ చిత్ర దర్శకుడు దశరథ్ స్పందించాడు. కాపీ ఆరోపణలు అతను తీవ్రంగా ఖండించాడు. దీనిపై అతనో ప్రెస్ నోట్లో వివరణ ఇచ్చాడు.

శ్యామలా రాణి రాసిన ‘నా మనసు కోరింది నిన్నే’ నవల 2010 ఆగస్టు 10న రిలీజైందని.. ఐతే ఆ నవల రిలీజవ్వడానికి 18 నెలల ముందే.. అంటే 2009 ఫిబ్రవరి 19న ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కథను 'నవ్వుతూ' అనే పేరుతో రైటర్స్ యూనియన్లో రిజిస్టర్ చేయించామని.. శ్యామలా రాణి రాసిన నవల రిలీజవ్వడానికి రెండేళ్ల ముందే.. తాను, నిర్మాత దిల్ రాజు కలిసి 2008 డిసెంబర్లో ‘బిల్లా’ షూటింగ్‌లో ఉన్న ప్రభాస్‌ను కలిసి కథ వినిపించగా.. అతను సానుకూలంగా స్పందించాడని దశరథ్ వివరించాడు.

తమ కథ రైటర్స్ యూనియన్లో ముందే రిజిస్టరైన విషయాన్ని యూనియన్ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ గారు శ్యామలారాణికి వివరించే ప్రయత్నం ఆరు నెలల కిందటే చేశారని.. కానీ ఆమె పట్టించుకోకుండా కేసు పెట్టడం దురదృష్ణకరమైన విషయమని.. ఇప్పటికైనా ఆమె వాస్తవం గ్రహించాలని దశరథ్ కోరాడు. దీనిపై వివరణ ఇవ్వమని శ్రేయోభిలాషులు కోరడంతో స్పందించాల్సి వచ్చిందని దశరథ్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English