రామ్‌ చరణ్‌కి ఎసరు పెడతాడా?

రామ్‌ చరణ్‌కి ఎసరు పెడతాడా?

కొత్త రకం పాత్రలు చేయడం లేదనే ఫిర్యాదుల వల్ల చరణ్‌ డిఫెన్స్‌లో పడిపోయాడు. తనతో పని చేయడానికి బోయపాటి, కొరటాల లాంటి మాస్‌ దర్శకులు రెడీగా వున్నా కానీ ప్రస్తుతానికి చరణ్‌ కొత్తదనం అందించే పనిలో వున్నాడు. చరణ్‌ ఇలా తన బలాన్ని వదులుకుని కొత్త ఇమేజ్‌ కోసం ట్రై చేస్తూ వుంటే తమ ఫ్యామిలీకే చెందిన అల్లు అర్జున్‌ చాపకింద నీరులా పాకిపోయాడు. ఏకు మేకు అయిపోయి చరణ్‌ కంటే పెద్ద రేంజ్‌కి చేరుకున్నాడు.

ఇంకా చరణ్‌ తన ఇమేజ్‌ మేకోవర్‌ పనిలోనే వుండగా, మరో మెగా హీరో కూడా టాప్‌కి చేరుకునే పనిలో బిజీగా వున్నాడు. ఫిదాతో కెరియర్‌ బిగ్గెస్ట్‌ హిట్‌ కొట్టడమే కాకుండా దాదాపు యాభై కోట్ల వసూళ్లు సాధించిన వరుణ్‌ తేజ్‌కి ఇప్పుడు ఫుల్‌ డిమాండ్‌ వుంది. ఇంతకాలం క్లాస్‌ సినిమాలు, ఆఫ్‌బీట్‌ సినిమాలు అంటూ కాలక్షేపం చేసిన వరుణ్‌ తేజ్‌ ఫిదా తర్వాత రూటు మార్చాడు. తనని మాస్‌ పాత్రల్లో చూడాలని కోరుకుంటోన్న అభిమానుల కోరిక మన్నించాడు.

ప్రస్తుతం కండలు పెంచే పనిలో పడ్డ వరుణ్‌ ఒక పూర్తి స్థాయి మాస్‌ సినిమాలో త్వరలోనే కనిపించబోతున్నాడు. విగ్రహ పుష్టి, అందమైన రూపం కూడా వున్న వరుణ్‌ మాస్‌ హీరోగాను క్లిక్‌ అయితే ఇక చరణ్‌కి తన ఇంట్లోనుంచే ఇద్దరితో పోటీ పడక తప్పని పరిస్థితి వుంటుంది. ఈ పరిస్థితిని మార్చి 'రంగస్థలం 1985' చరణ్‌ని తిరిగి అందలం ఎక్కిస్తుందని ఎక్స్‌క్లూజివ్‌ చెర్రీ ఫాన్స్‌ ఆశిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు