అతను ఎంత ఎక్కితే స్పైడర్‌కి అంత కిక్‌!

అతను ఎంత ఎక్కితే స్పైడర్‌కి అంత కిక్‌!

స్పైడర్‌ చిత్రం ట్రెయిలర్‌లో అన్ని అంశాలు కవర్‌ చేసారు కానీ హీరో, విలన్‌ మధ్య క్లాష్‌ మాత్రం అంతగా చూపించలేదు. కానీ ఈ చిత్రం ప్రధానంగా హీరో విలన్‌ క్లాష్‌ మీదే నడుస్తుందని తెలిసింది. విలన్‌గా ఇందులో ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు ఎస్‌.జె. సూర్య నటించాడు. 'డార్క్‌ నైట్‌'లోని జోకర్‌ పాత్ర స్ఫూర్తితో ఈ క్యారెక్టర్‌ని మురుగదాస్‌ తీర్చిదిద్దాడట.

ఇందులో మహేష్‌, సూర్య మధ్య నడిచే ఫైట్‌ కూడా క్రిస్టఫర్‌ నోలాన్‌ తీసిన డార్క్‌ నైట్‌ని తలపించేలా వుంటుందని సమాచారం. గతంలో అదే దర్శకుడు తీసిన మెమంటో చిత్రాన్ని గజినిగా ఫ్రీమేక్‌ చేసి మురుగదాస్‌ ఘన విజయాన్ని అందుకున్నాడు.

స్పైడర్‌లో విలన్‌ క్యారెక్టర్‌ కోసం చాలా మంది పేర్లు పరిశీలించి ఫైనల్‌గా సూర్యని ఓకే చేసారు. అతను ఇంతవరకు పూర్తి స్థాయి విలన్‌గా చేయకపోవడం, అతని నటనలో క్యారెక్టర్‌కి కావాల్సిన లక్షణాలు పుష్కలంగా కనిపించడంతో సూర్యని మురుగదాస్‌ ఎంచుకున్నాడు.

తమిళ వెర్షన్‌ వరకు ఎస్‌జె సూర్య ప్లస్‌ అవ్వవచ్చు కానీ తెలుగు ప్రేక్షకులు అతడినెంత లైక్‌ చేస్తారనేది తెలియదు. పాత తమిళ నటుల నటనని అనుసరించే సూర్యని కంట్రోల్‌లో వుంచి ఈ పాత్రని మురుగదాస్‌ చేయించుకున్నాడా? విలన్‌గా అతను తెలుగు వారిని కూడా మెప్పించగలడా అనే అంశాలపైనే స్పైడర్‌ రిజల్ట్‌ డిపెండ్‌ అయి వుంటుందని అంటున్నారు. ఈ చిత్రంలో విలన్‌ పాత్ర చాలా కీలకమని, అది ఎంతగా నచ్చితే అంతగా ఈ చిత్రం ఆదరణ పొందుతుందని చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు