చిరంజీవి మాట అప్పుడే వినాల్సిందా?

చిరంజీవి మాట అప్పుడే వినాల్సిందా?

చిరంజీవి రీఎంట్రీ సినిమా 'ఖైదీ నంబర్‌ 150'లో సునీల్‌కి ఒక లెంగ్తీ క్యారెక్టర్‌ ఆఫర్‌ చేసారు. కానీ హీరో వేషాలు తప్ప కామెడీ పాత్రలు చేయనంటూ సునీల్‌ ఆ అవకాశం వదిలేసుకున్నాడు. తర్వాత ఆ పాత్రని తీసేసి మరో విధంగా స్క్రీన్‌ప్లే రాసుకున్నారు.

కట్‌ చేస్తే, ఎనిమిది నెలల తర్వాత చిరంజీవి మలి చిత్రం 'సైరా నరసింహారెడ్డి'లో కామెడీ పాత్ర పోషిస్తున్నానని అడిగిన వాళ్లకి, అడగని వాళ్లకి కూడా చెప్తున్నాడు. హీరోగా కెరియర్‌ కుంటు పడడంతో కామెడీ పాత్రలు చేయక తప్పని పరిస్థితి వచ్చేయడంతో సునీల్‌ ఈసారి చిరంజీవి ఆఫర్‌ మిస్‌ అవలేదు. అయితే ఈ నిర్ణయమేదో ఖైదీ టైమ్‌లోనే తీసుకుని వుంటే ఈలోగా సునీల్‌ బిజీ అయి వుండేవాడు. సైరా నరసింహారెడ్డి రిలీజ్‌ అవడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. ఈలోగా సునీల్‌కి ఎన్ని కామెడీ పాత్రలు వస్తాయనేది తెలియదు.

ఖైదీకి కనుక కరక్ట్‌ డెసిషన్‌ తీసుకుని వుంటే సునీల్‌కి ఈ సమయం అంతా వృధా అయి వుండేది కాదు. ఉంగరాల రాంబాబు డిజాస్టర్‌ అవడంతో పాటు కనీసం నామమాత్రపు ఓపెనింగ్‌ తెచ్చుకోలేకపోవడంతో సునీల్‌ మీద క్రేజ్‌ పూర్తిగా పోయింది. అతనికి ఆఫర్లు ఇచ్చే నిర్మాతలే కరవైపోయారు.

హీరోగా ఇంకా అవకాశాలు పొందుతోన్న టైమ్‌లోనే కామెడీ క్యారెక్టర్లు కూడా చేసి వున్నట్టయితే సునీల్‌కి కలిసొచ్చి వుండేది. ఇప్పుడు కమెడియన్‌గా కూడా తను అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు ఇష్టపడకపోవచ్చు. ఇండస్ట్రీలో ఏదైనా టైమింగ్‌తో ముడిపడి వుంటుందని ఊరికే అనరు మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు