పెళ్లికి ముందు ఇది మామూలు పంచ్ కాదు

పెళ్లికి ముందు ఇది మామూలు పంచ్ కాదు

ఇంకో రెండు వారాల్లో అక్కినేని నాగచైతన్య పెళ్లి. మొన్నటి దాకా చాలా ఖుషీగా ఉన్నాడు నాగార్జున పెద్ద కొడుకు. ఇటు ప్రొఫెషనల్‌గా, అటు పర్సనల్‌గా రెండు రకాలుగా అతడికి ఆనందమే. ఐతే ఇప్పుడు అతడిని నైరాశ్యం ఆవహించేసింది. అందుక్కారణం చైతూ కొత్త సినిమా 'యుద్ధం శరణం' అతడి కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ కావడమే. ఒక సినిమా పోయినంత మాత్రాన ఏమైపోతుందనుకోవచ్చు.

కానీ ఇది మామూలు డిజాస్టర్ కాదు. దీని వల్ల చాలామంది జీవితాలు తల్లకిందులైపోయాయి. మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా పేరున్న సాయి కొర్రపాటి 'యుద్ధం శరణం' వల్ల దారుణంగా నష్టపోయాడు. గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో నష్టపోతూ వస్తున్న సాయిని ఈ సినిమా కోలుకోలేని దెబ్బ తీసింది.

మరోవైపు 'యుద్ధం శరణం'తో ప్రొడక్షన్లోకి అడుగుపెట్టిన రాజమౌళి తనయుడు కార్తికేయకూ ఇది పెద్ద ఎదురు దెబ్బే. అతను కూడా చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు ఈ సినిమాతో. హీరోయిన్ లావణ్య కెరీర్ అసలే ప్రమాదంలో ఉంటే.. 'యుద్ధం శరణం' ఆమెను మరింత ఇబ్బందుల్లో పడేసింది. అన్నింటికీ మించి ఎన్నో కష్టాల తర్వాత ఎట్టకేలకు ఈ చిత్రంతోనే దర్శకుడిగా మారిన చైతూ మిత్రుడు కృష్ణ మారిముత్తుకు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది.

ఇక అతడికి అవకాశాలు దక్కడం కష్టమే. చైతూ ఏరి కోరి తన మిత్రుడిని దర్శకుడిగా చేయడం కోసం ఈ ప్రాజెక్టు సెట్ చేశాడు. దీంతో అతను బ్లేమ్ తీసుకోవాల్సి వస్తోంది. అందుకే చైతూ కెరీర్లో ఇంతకుముందు వచ్చిన ఫ్లాపుల కంటే ఇది అతడికి చాలా పెద్ద తలనొప్పిగా మారింది. హ్యాట్రిక్ హిట్ అందుకుని ఖుషీ ఖుషీగా పెళ్లి చేసుకుందామనుకుంటే.. ఇలా ఎదురు దెబ్బ తగలడం చైతూ సంతోషాన్ని కొంత తగ్గించేదే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు