కంగనా మళ్లీ బోల్తా కొట్టిందిగా..

కంగనా మళ్లీ బోల్తా కొట్టిందిగా..

కంగనా రనౌత్ కొత్త సినిమా 'సిమ్రన్' టీజర్, ట్రైలర్ చూసినప్పటి నుంచి ఇది మరో 'క్వీన్' అయిపోతుందని.. కంగనా ఇమేజ్ మరింత పెరిగిపోతుందని అంటున్నారు ఆమె అభిమానులు. కంగనా ఫ్యాన్స్‌కు మాత్రమే కాదు.. సామాన్య ప్రేక్షకులకు కూడా ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. కానీ 'సిమ్రన్' ఆ అంచనాల్ని ఏమాత్రం అందుకోలేకపోయింది. ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకుంది.

'క్వీన్'కు దీనికి పోలికే లేదంటున్నారు క్రిటిక్స్. ప్లాట్ కొంచెం కొత్తగా ఉన్నప్పటికీ.. కంగనా ఎప్పట్లాగే పెర్ఫామెన్స్ అదరగొట్టేసినప్పటికీ.. సినిమాలో మాత్రం అంత విషయం లేదని తేల్చేశారు. విదేశాల్లో సెటప్.. ఒక అమ్మాయి జీవితంలో ఆటుపోట్లు.. తన రైజింగ్.. ఇవన్నీ చూస్తే 'క్వీన్' స్టయిల్లోనే సినిమా సాగుతున్నట్లు అనిపిస్తుంది కానీ.. ఆ సినిమాలో ఆసక్తి మాత్రం లేదన్నది టాక్. చాలా వరకు సినిమా బోరింగే అంటున్నారు.

విడాకులు తీసుకుని పారిన్లోని ఒక దుకాణంలో షాప్ కీపర్‌గా పని చేసే 30 ఏళ్ల మహిళ రొటీన్ జీవితం మీద విరక్తి పుట్టి ఇంటి నుంచి బయటికి వచ్చేయడం.. క్యాసినోలో జూదం ఆడి డబ్బులు సంపాదించడం.. తర్వాత ఆ డబ్బులన్నీ పోగొట్టుకుని ఇబ్బంది పడటం.. ఇలా సాగుతుంది 'సిమ్రన్'.

హన్సల్ మెహతా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది ఆరంభంలో 'రంగూన్'తో ఎదురు దెబ్బ తిన్న కంగనాకు.. ఇప్పుడు 'సిమ్రన్' రూపంలో పంచ్ పడింది. ఇక ఆమె ఆశలన్నీ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మణికర్ణిక' మీదే ఉన్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు