రాజమౌళి, రామ్‌ చరణ్‌ కూడా కాపాడలేదు

రాజమౌళి, రామ్‌ చరణ్‌ కూడా కాపాడలేదు

రచయితగా ఎన్నో విజయవంతమైన చిత్రాలకి పని చేసిన విజయేంద్రప్రసాద్‌ దర్శకుడిగా మాత్రం సక్సెస్‌ కాలేకపోయారు. శ్రీకృష్ణ 2006, రాజన్న చిత్రాలని డైరెక్ట్‌ చేసిన విజయేంద్రప్రసాద్‌ 'బాహుబలి' తర్వాత 'శ్రీవల్లి' అనే ఎరాటిక్‌ థ్రిల్లర్‌కి డైరెక్షన్‌ చేయడం ఆసక్తి కలిగించింది.

అంతటి పేర్గాంచిన దర్శకుడు ఇలాంటి బోల్డ్‌ జోనర్‌ని ఎంచుకోవడం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయింది. చాలా కాలంగా విడుదలకి నోచుకోని ఈ చిత్రానికి రాజమౌళితో పాటు రామ్‌ చరణ్‌ కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదో అద్భుతమైన చిత్రమంటూ విజయేంద్రప్రసాద్‌ చాలానే చెప్పుకొచ్చారు.

రాజమౌళి కూడా మొహమాటం కొద్దీ తండ్రి సినిమాకి వత్తాసు పలికాడు. అయితే ఎన్ని చేసినా కానీ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. పోస్టర్లు చాలా సెక్సీగా, పూర్తి స్కిన్‌ షోతో డిజైన్‌ చేయించినా కానీ శ్రీవల్లి తొలి రోజున చెపుకోతగ్గ వసూళ్లు సాధించలేదు.

ఇక ఈ చిత్రం చెత్తగా వుందంటూ విమర్శకులు చీల్చి చెండాడేస్తున్నారు. కొన్ని వెబ్‌సైట్లలో దీనికి పాయింట్‌ ఫైవ్‌ రేటింగులు కూడా ఇచ్చారు. రచయితగా జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న విజయేంద్రప్రసాద్‌ ఇక దర్శకుడిగా బ్రేక్‌ తీసుకుని ఆ పని తనయుడికే వదిలిపెడితే మంచిదని కూడా సూచిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు