ఎన్టీఆర్‌ కోసం ఆకలిగా చూస్తున్నారు

ఎన్టీఆర్‌ కోసం ఆకలిగా చూస్తున్నారు

టాలీవుడ్‌ని ప్రతి శుక్రవారం వేధిస్తోన్న పరాజయాలు ఈసారి కూడా విడిచిపోలేదు. అరడజను సినిమాలు విడుదలైతే కనీసం అందులో ఒకటి కూడా మెచ్చుకోతగ్గ రీతిన లేకపోగా ప్రేక్షకులకి సహన పరీక్ష పెట్టాయి. సునీల్‌ 'ఉంగారల రాంబాబు' అయినా 'జై లవకుశ' వచ్చే వరకు థియేటర్ల ఫీడింగ్‌కి పనికొస్తుందని ఆశించారు.

కానీ ఈ చిత్రానికి వచ్చిన టాక్‌ని బట్టి ఈ చిత్రం నిలబడే సూచనలు లేవని తేలిపోయింది. మామూలుగా సునీల్‌ సినిమాలకి బి, సి సెంటర్లలో అయినా వసూళ్లు బాగా వస్తుంటాయి. కానీ ఈ చిత్రానికి ఓపెనింగ్స్‌ కూడా సరిగా రాకపోవడంతో ఇక ఎన్టీఆర్‌ సినిమా వచ్చేవరకు బాక్సాఫీస్‌కి గడ్డు కాలం తప్పదని తేలిపోయింది.

నారా రోహిత్‌కి 'కథలో రాజకుమారి' రూపంలో మరో ఘోరమైన ఫ్లాప్‌ తగిలింది. దర్శకుడిగా నిరూపించుకోవాలని చూస్తోన్న వెటరన్‌ రైటర్‌ విజయేంద్రప్రసాద్‌కి శ్రీవల్లితో చుక్కెదురైంది.

గత వారం వచ్చిన యుద్ధం శరణం, మేడ మీద అబ్బాయి రెండూ డిజాస్టర్లు అవడంతో జై లవకుశ వచ్చేవరకు కనీసం థియేటర్ల రెంట్లు రాబట్టే సినిమాలు కూడా మార్కెట్లో లేకుండా పోయాయి. దీంతో ఎన్టీఆర్‌ సినిమా కోసం ట్రేడ్‌ వర్గాలన్నీ ఆకలిగా ఎదురు చూస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు