బొమ్మ అదిరిందంట!

బొమ్మ అదిరిందంట!

తమిళ సూపర్‌స్టార్‌ అజిత్‌ తాజా చిత్రం 'ఆరంభం'కి ఆరంభం అదిరింది. అజిత్‌ అన్ని సినిమాలలానే ఈ చిత్రానికి కూడా ఓపెనింగ్‌ బ్రహ్మాండంగా వచ్చింది. అజిత్‌తో బిల్లా తీసి హిట్‌ అయిన విష్ణువర్ధన్‌ ఈ చిత్రాన్ని కూడా అజిత్‌ ఫాన్స్‌కి కనుల పండుగలా తీర్చి దిద్దాడని టాక్‌. సినిమాలో కంటెంట్‌ యావరేజ్‌గా ఉన్నా కానీ అజిత్‌ సింగిల్‌ హ్యాండెడ్‌గా సినిమాని నిలబెట్టేశాడని రివ్యూస్‌ అన్నిట్లో ఒకే కామెంట్‌ వినిపిస్తోంది.

ఇందులో అతనికి సపోర్ట్‌గా నటించిన ఆర్య కూడా అదరగొట్టాడంట. నయనతార చాలా గ్యాప్‌ తర్వాత తమిళంలో చేసిన ఈ చిత్రంతో హిట్‌ కొట్టిందనే అంటున్నారు. స్టయిలిష్‌ డైరెక్టర్‌గా పేరున్న విష్ణువర్ధన్‌ ఈ చిత్రాన్ని కూడా ఎంతో స్టయిలిష్‌గా తెరకెక్కించాడని, ప్రతి షాట్‌ చాలా స్టయిలిష్‌గా, మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉందని కాంప్లిమెంట్స్‌ ఇస్తున్నారు. ఈ టాక్‌తో ఒక పది రోజులు రన్‌ అయినా కానీ ఇది కమర్షియల్‌గా పెద్ద రేంజ్‌ చేరుకుంటుంది. అజిత్‌ గత చిత్రం 'బిల్లా 2' నిరాశ పరిచిన నేపథ్యంలో ఆరంభంకి వస్తున్న టాక్‌ అతనికి ఉన్న అసంఖ్యాకమైన అభిమానులకి అంతులేని ఆనందాన్ని ఇస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు