తాగుబోతు పాత్ర‌లో 'బిచ్చ‌గాడు'!

తాగుబోతు పాత్ర‌లో 'బిచ్చ‌గాడు'!

డాక్ట‌ర్ కాబోయి యాక్ట‌ర్ అయ్యాన‌ని సినీ ఇండ‌స్ట్రీలో ఓ నానుడి ఉంది. అదే త‌ర‌హాలో చాలా మంది సినిమాల్లో ఒక విభాగంలో ప్రొఫెష‌న‌ల్ అవుదామ‌ని వ‌చ్చి హీరోలుగా రాణిస్తున్నారు. కోలీవుడ్‌ హీరో విజ‌య్ ఆంటోనీ అదే కోవ‌కు చెందుతాడు. 2005 మ్యూజిక్ డైరెక్ట‌ర్ క‌మ్ సింగర్ గా త‌న కెరీర్ ప్రారంభించిన విజ‌య్ ఆంటోని 2012 లో నాన్‌(న‌కిలీ) సినిమాతో హీరోగా మారాడు. వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ స‌లీమ్‌, బిచ్చ‌గాడు వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌ను అందుకున్నాడు. విజ‌య్ తాజా చిత్రం 'ఇంద్రసేన' త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ను మెగా స్టార్ చిరంజీవి రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను హీరోయిన్ రాధిక నిర్మిస్తోంది. ఈ సినిమాలో విజ‌య్ అన్న‌ద‌మ్ముల పాత్ర‌లో డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నాడ‌ట‌. తాగుబోతు పాత్రలో అన్నయ్యగా , బాధ్యత తెలిసిన పీఈటీ మాస్టర్ గా తమ్ముడి పాత్రలో విజ‌య్ క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ఈ సినిమాలో ఫస్టాఫ్ సరదాగా సాగిపోతుందనీ, సెకండాఫ్ బిచ్చ‌గాడు త‌రహాలో క‌న్నీళ్లు పెట్టిస్తుందని కోలీవుడ్ టాక్‌. నవంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బిచ్చ‌గాడు త‌ర‌హాలోనే ఇది కూడా మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవుతుందేమే వేచి చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు