మహేష్‌బాబుకి డబ్బా కొడితే చాలా?

మహేష్‌బాబుకి డబ్బా కొడితే చాలా?

నా వెనుక మహేష్‌బాబు ఉన్నాడు, నా ముందు అభిమానులు ఉన్నారంటూ మహేష్‌ బావమరిది, కృష్ణ అల్లుడు సుధీర్‌బాబు కాస్త ఓవర్‌గానే స్పీచ్‌ ఇచ్చాడు. 'ఆడు మగాడ్రా బుజ్జీ' సినిమా ఆడియో ఫంక్షన్‌లో అతని మాటల్ని బట్టి చూస్తే ఏదో సాధించాననే ఫీలింగ్‌ కనిపించింది. 'ప్రేమకథాచిత్రమ్‌' తన పనితనం అతను అనుకుంటే కనుక త్వరగా ఆ భ్రమల్లోంచి బయటకి రావాలి. ఆ సినిమాలో హీరో నామ్‌ కే వాస్తే మాత్రమే. ఎవరు హీరోగా నటించినా కానీ ఏమాత్రం తేడా పడని సినిమా అది. అందులో హీరో కంటే కమెడియన్స్‌దే ప్రధాన పాత్ర. నటుడిగా అతను సాధించిన పరిణితి ఏమీ లేదు.

'ఆడు మగాడ్రా బుజ్జీ' ట్రెయిలర్‌లో ఉన్న కాసిని సీన్లలోనే సుధీర్‌బాబు ఇంతవరకు ఏమీ నేర్చుకోలేదనే సంగతి స్పష్టమవుతోంది. ముఖంలో కనీసం చిన్న ఎక్స్‌ప్రెషన్‌ కూడా లేకుండా సుధీర్‌ డైలాగ్స్‌ అప్పజెప్తున్నాడు. డాన్సులు బాగా చేయడం వచ్చినంత మాత్రాన, లేదా మహేష్‌బాబు భజన చేసినంత మాత్రాన తనని ఎవరూ పట్టించుకోరని సుధీర్‌ తెలుసుకోవాలి. తన బావలా సక్సెస్‌ కావాలంటే ముందు నటనలో ఓనమాలు నేర్చుకునేందుకు సుధీర్‌ ట్రై చేయాలి. లేదంటే చాలా మంది హీరోల మధ్య కరివేపాకు మాదిరిగా మిగిలిపోవాల్సి వస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు