తమ్ముడికి నేషనల్ అవార్డేనట

తమ్ముడికి నేషనల్ అవార్డేనట

జూనియర్ ఎన్టీఆర్‌కు ఇప్పటిదాకా వచ్చిన అవార్డులన్నీ ఒకెత్తు అని.. 'జై లవకుశ'తో అందుకోబోయే అవార్డులు మరో ఎత్తు అని అన్నాడు అతడి అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్. 'జై లవకుశ'తో తారక్ ఏకంగా నేషనల్ అవార్డే అందుకోబోతున్నాడని.. ఆ అవార్డు అందుకున్నాక అభిమానులతో తన ఆనందాన్ని పంచుకుంటానంటూ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పేశాడు కళ్యాణ్ రామ్.

ఈ సినిమాలో ఎన్టీఆర్ పోషించిన నత్తి పాత్రను ఇంకెవరైనా చేయగలరా.. అని ప్రశ్నించిన కళ్యాణ్ రామ్.. తన తమ్ముడు మాత్రమే ఈ పాత్ర.. ఈ సినిమా చేయగలడు అని కళ్యాణ్ రామ్ అన్నాడు. బాబీ తనకు 'జై లవకుశ' కథను 10 నిమిషాలు మాత్రమే చెప్పాడని.. తనకు తన తాతయ్య నటించిన ఆల్ టైం క్లాసిక్ 'దాన వీర శూర కర్ణ' గుర్తుకొచ్చిందని.. ఆ సినిమాను ఇంకెవరూ టచ్ చేయనట్లే.. 'జై లవకుశ'ను కూడా తారక్ తప్ప ఎవరూ చేయలేరని కళ్యాణ్ రామ్ అభిప్రాయపడ్డాడు.

'జై లవకుశ' కథ తారక్ కోసమే పుట్టినప్పటికీ, అతను మాత్రమే ఈ పాత్రను చేయగలిగినప్పటికీ.. ఈ కథపై తన నిర్ణయం చెప్పడానికి వారం రోజులు సమయం తీసుకున్నాడని.. ఆ వారం రోజులూ ఇందులో జై పాత్రను ఎలా చేయాలనే ఆలోచించి, ఆ విషయంలో ఒక మేనరిజం అదీ రెడీ చేసుకున్నాడని కళ్యాణ్ రామ్ చెప్పాడు. ఈ పాత్రలో ఎన్టీఆర్ ఎలా ఇన్వాల్వ్ అయిపోయాడో చెబుతూ.. ఒక రోజు అర్ధరాత్రి తనకు లక్ష్మీప్రణతి ఫోన్ చేసి కంగారు పడిందని.. విషయమేంటని అడిగితే తారక్ అర్ధరాత్రి నిద్రలో లేచి నడుస్తూ నత్తితో మాట్లాడుతూ కిటికీ దగ్గరికెళ్లి కాలు బయటపెట్టేశాడని.. దాని వల్ల గాయం కూడా అయిందని చెప్పిందని.. తాను ఆమెను అనునయించాక తమ్ముడిని కలిశానని.. ఈ పాత్ర గురించి, సినిమా గురించి ఎక్కువ ఆలోచించి స్ట్రెయిన్ అయిపోతున్నావని చెప్పి వారం రోజులు రెస్ట్ తీసుకోమన్నానని.. కానీ సెప్టెంబరు రిలీజ్ అని అభిమానులకు మాటిచ్చాం అంటూ రెస్ట్ తీసుకోవడానికి తారక్ ఇష్టపడలేదని కళ్యాణ్ రామ్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు