అక్కడ సహాయ నటి.. ఇక్కడ హీరోయిన్

అక్కడ సహాయ నటి.. ఇక్కడ హీరోయిన్

‘కేశవ’ లాంటి మోడరేట్ సక్సెస్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నాడు యువ కథానాయకుడు నిఖిల్. ఐతే ఎట్టకేలకు అతడి కొత్త సినిమా సెట్స్ మీదికి వెళ్లింది. కన్నడలో గత ఏడాది సూపర్ హిట్టయిన ‘కిరిక్ పార్టీ’ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాకు కథానాయికను కూడా ఖరారు చేశారు. ‘కిరిక్’ పార్టీలో నటించిన అమ్మాయినే తెలుగు వెర్షన్ కు కథానాయికగా ఎంపిక చేశారు. ఆ అమ్మాయి పేరు.. సంయుక్త హెగ్డే.

ఐతే కన్నడ వెర్షన్లో ఆమె లీడ్ హీరోయిన్ కాదు. తనది సహాయ పాత్ర. అక్కడ రష్మిక మండోనా కథానాయికగా నటించింది. రష్మిక ఆల్రెడీ తెలుగులో రెండు సినిమాలు కమిటైంది కూడా. కానీ ఆ అమ్మాయిని తెలుగు వెర్షన్ కు హీరోయిన్ గా తీసుకోకుండా.. ఒరిజినల్లో సహాయ పాత్ర పోషించిన అమ్మాయిని కథానాయికగా ఎంచుకున్నారు.

ఐతే కన్నడలో సంయుక్తది కూడా కీలక పాత్రే. ఆమె ఈ సినిమాకు గాను కొన్ని అవార్డులు కూడా అందుకుంది.
నిఖిల్ తో ‘స్వామి రారా’.. ‘కేశవ’ సినిమాలు తీసిన సుధీర్ వర్మ దగ్గర అసిస్టెంటుగా పని చేసిన శరణ్ కొప్పిశెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నిజానికి ఈ సినిమాకు ముందు రాజు సుందరంను దర్శకుడిగా అనుకున్నారు. కానీ అతను అనివార్య కారణాల వల్ల తప్పుకున్నాడు. సుధీర్ వర్మతో పాటు చందూ మొండేటి ఈ చిత్రానికి రచనా సహకారం అందిస్తుండటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు