పిఎస్‌పికె 25... థియేటర్లు మోతెక్కిపోతాయ్‌

పిఎస్‌పికె 25... థియేటర్లు మోతెక్కిపోతాయ్‌

పవన్‌కళ్యాణ్‌ రాబోయే చిత్రం నుంచి అనిరుధ్‌ ఒక మ్యూజిక్‌ బిట్‌ రిలీజ్‌ చేసాడు చూసారా? అందులో పవన్‌కళ్యాణ్‌ కుర్చీ తిప్పుతూ కనిపించే ఒక షాట్‌ వుంది కదా? ఆ షాట్‌ని అక్కడ చూపించడానికి చిన్న కారణముందట. ఈ చిత్రంలో ఇదే హైలైట్‌ సీన్‌ అని, పవన్‌కళ్యాణ్‌ క్యారెక్టర్‌ 'అజ్ఞాతం' నుంచి బయటకి వచ్చి ఒక్కసారిగా పవర్‌ చూపించే 'బాషా' తరహా సీన్‌ అని విశ్వసనీయంగా తెలిసింది.

ఆ సీన్‌తో ఒక్కసారిగా గ్రాఫ్‌ పైకి లేస్తుందట. ఈ సీన్‌కి థియేటర్లలో ఫాన్స్‌ చేసే గోల అలా ఇలా వుండదని అంటున్నారు. ఈ చిత్రంలో ఆ తరహా సీన్లు నాలుగైదు వుంటాయని, కానీ ఈ సీన్‌ మాత్రం హీరో ఎలివేషన్‌లో మరో స్థాయిలో నిలిచిపోయేలా వుంటుందని సమాచారం.

అందుకే త్రివిక్రమ్‌ ఈ షాట్‌ని ఇప్పుడే లీక్‌ చేసి టీజ్‌ చేసాడట. ఈ చిత్రంలో పవన్‌ రెండు షేడ్స్‌ వున్న క్యారెక్టర్‌లో కనిపిస్తాడు. ఒకటి శాంత స్వభావి కాగా, మరొకటి ఫుల్‌ మాస్‌ హీరోయిజం వుట్టిపడే షేడ్‌ అట. ఈ చిత్రం అద్భుతంగా షేప్‌ అవుతోందని, అందుకే సంక్రాంతికి మిగతా ఏ సినిమాలు వస్తాయనే లెక్క లేకుండా రిలీజ్‌ డేట్‌ ముందే ఫిక్స్‌ చేసేసారని చెబుతున్నారు.

వినడానికే ఇలాగున్న ఈ న్యూస్‌ నిజంగా నిజమైతే రేపు థియేటర్లలో జరిగే రచ్చ ఎలాగుంటుందో కదూ?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు