మహేష్‌కి అలాంటోడు దొరకలేదు

మహేష్‌కి అలాంటోడు దొరకలేదు

'స్పైడర్‌' చిత్రాన్ని మురుగదాస్‌తో తలపెట్టినపుడు హిందీ మార్కెట్‌ని కూడా దృష్టిలో వుంచుకున్నారు. మురుగదాస్‌ బాలీవుడ్‌లో మంచి పేరే తెచ్చుకున్నాడు కనుక ఈ చిత్రానికి అక్కడ క్రేజ్‌ వుంటుందని అనుకున్నారు. ఇదే కారణమ్మీద స్పైడర్‌పై ఎక్కువ ఖర్చు పెట్టారు.

అయితే బాలీవుడ్‌ నుంచి ఆశించిన స్పందన రాలేదు. బాహుబలి తర్వాత దక్షిణాది అనువాద చిత్రాలని బాలీవుడ్‌ బయ్యర్లు లెక్క చేస్తారని అనుకున్నారు కానీ అది జరగలేదు. అసలు ఈ చిత్రానికి ఈ టైఇల్‌ పెట్టడానికి కూడా హిందీ రిలీజ్‌ ప్లాన్సే కారణమట. అక్కడి వారు ఈజీగా కనక్ట్‌ అవుతారని టైటిల్‌ అలా ప్లాన్‌ చేసుకున్నారు కానీ అనుకున్నట్టు జరగలేదు.

బాహుబలి చిత్రానికి బాలీవుడ్‌లో ఫేస్‌ వేల్యూ తెచ్చిపెట్టింది కరణ్‌ జోహార్‌. అతని ఇన్‌వాల్వ్‌మెంట్‌ వలనే ఆ చిత్రాన్ని అక్కడ మార్కెట్‌ చేసుకోవడం, మీడియా అటెన్షన్‌ రాబట్టడం తేలికయింది. అలా స్పైడర్‌కి కూడా ఏదైనా పెద్ద నిర్మాణ సంస్థ అండ దొరుకుతుందని అనుకున్నారు కానీ అది జరగలేదు. నమ్రత తనకి వున్న బాలీవుడ్‌ కాంటాక్ట్స్‌ ద్వారా ట్రై చేసినా కానీ ఫలితం లేకపోయిందట.

హిందీలోకి అనువదించి, అక్కడి వాళ్లు పట్టించుకోక ఇబ్బందులు పడేకంటే, అసలు హిందీ రిలీజ్‌ మానేసుకుంటే బెటర్‌ అని నిర్ణయించుకున్నారట. సెప్టెంబర్‌ 27న హిందీలో అయితే స్పైడర్‌ రిలీజ్‌ అవడం లేదు. తెలుగు, తమిళంలో వచ్చే స్పందనని బట్టి అనువదించి రిలీజ్‌ చేస్తారో లేక ఎప్పటిలా మురుగదాస్‌ ఎవరైనా బాలీవుడ్‌ హీరోతో రీమేక్‌ చేస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు