'లై'కి ఇలాంటి కబుర్లే చెప్పారు

'లై'కి ఇలాంటి కబుర్లే చెప్పారు

'లై' చిత్రం విడుదలకి ముందు ఇంటెల్లిజెంట్‌ సినిమా, ఇంటెల్లిజెంట్‌ సినిమా అంటూ ఊదరగొట్టారు. ఆ తెలివితేటలకి ప్రేక్షకులు పెదవి విరవడంతో ఈ ఏడాదిలో వచ్చిన అతి పెద్ద డిజాస్టర్స్‌లో ఒకటిగా మిగిలిపోయింది. ప్రేక్షకులకి తెలివైన సినిమాలు అందించాలని చూసిన ప్రతిసారీ సీన్‌ రివర్స్‌ అయింది.

సినిమా తెలివిగా వుందని ప్రేక్షకులు ఫీలయితే ఓకే కానీ, ఇది తెలివైన ప్రేక్షకుల కోసమని చెప్పినవి తిరగబడ్డాయి. రేపు రాబోతున్న 'యుద్ధం శరణం' గురించి నాగచైతన్య ఇలాంటి మాటలే చెబుతున్నాడు. ఈ చిత్రాన్ని యాక్షన్‌ సినిమాగానో, థ్రిల్లర్‌గానో పిలవడానికి ఇష్టపడనని, ఇంటిల్లిజెంట్‌ సినిమా అనండని అంటున్నాడు.

ఇందులో తాను డ్రోన్‌ మేకర్‌గా నటించాడట. సెకండాఫ్‌ మొత్తం విలన్‌ని హీరో తన తెలివితేటలతో ఎలా దెబ్బ కొట్టాడనే ఇంటిల్లిజెంట్‌ ప్లే మీదే నడుస్తుందట. ఇలాంటి కాన్సెప్టులు బాగా తెరకెక్కితే ఆకట్టుకుంటాయి.

కానీ అతి తెలివికి పోయి 'లై'కి చేసినట్టు చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఈ చిత్రం యువ ప్రేక్షకులకి బాగా నచ్చుతుందని, అందుకే కాలేజీ టూర్స్‌కి వెళ్లి యువతని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు