ఫ్లాప్ సినిమా 150 కోట్లు దాటింది

ఫ్లాప్ సినిమా 150 కోట్లు దాటింది

రెండు వారాల కిందట భారీ అంచనాల మధ్య విడుదలైన తమిళ స్టార్ హీరో అజిత్ కొత్త సినిమా ‘వివేగం’ ఆరంభం నుంచి డివైడ్ టాక్‌తో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఐతే టాక్ ఎలా ఉన్నప్పటికీ ఈ సినిమా వసూళ్లకైతే ఢోకా లేదు. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిందన్న వార్త సంచలనం రేపుతోంది.

ఇండియాలోనే వసూళ్లు రూ.100 కోట్లకు పైగా వచ్చినట్లు చెన్నై ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. తొలి వారంలోనే ఈ చిత్రం రూ.100 కోట్ల గ్రాస్ మార్కును అందుకుందట. రెండో వారంలోనూ జోరు చూపిస్తూ కలెక్షన్ల మోత మోగిస్తున్నట్లు కోలీవుడ్ మీడియా చెబుతోంది.

‘వివేగం’.. రజినీకాంత్ ‘కబాలి’తో పాటు ‘బాహుబలి: ది కంక్లూజన్’ తమిళ వెర్షన్ కలెక్షన్ల రికార్డుల్ని దాటేసినట్లు చెబుతున్నారు. చెన్నై బాక్సాఫీస్ లో తొలి రోజే రూ.1.2 కోట్ల వసూళ్లతో ‘కబాలి’ రికార్డును బద్దలు కొట్టిన ‘వివేగం’.. ఆ సిటీలో ఇప్పటికే రూ.8.5 కోట్ల మార్కును దాటేసి ‘బాహుబలి-2’ కొన్ని నెలల కిందట చెన్నైలో రూ.8.2 కోట్ల వసూళ్లతో నెలకొల్పిన రికార్డును కూడా అధిగమించినట్లు సమాచారం.

తమిళనాడు వరకు ‘వివేగం’ ఇప్పటికీ మంచి వసూళ్లే రాబడుతోందట. ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.180 కోట్ల మార్కును అందుకోవచ్చంటున్నారు. ఫ్లాప్ టాక్ తోనే ఇలాంటి వసూళ్లొస్తే.. హిట్ టాక్ వస్తే పరిస్థితి ఎలా ఉండేదో మరి. ఐతే ‘వివేగం’ వసూళ్లను ఎక్కువ చేసి చెబుతున్నారన్న విమర్శలూ లేకపోలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు