హ‌నీ ప్రీత్ గురించి అస‌లు విష‌యాలు ఇవే!

హ‌నీ ప్రీత్ గురించి అస‌లు విష‌యాలు ఇవే!

డేరా బాబాగా ప్ర‌చారంలోకి వ‌చ్చిన హ‌రియాణాకు చెందిన డేరా స‌చ్చా సౌదా అధిప‌తి.. రాం ర‌హీం బాబాకు ద‌త్త పుత్రిక‌గా ఇటీవ‌ల వార్త‌ల్లోకి వ‌చ్చిన హ‌నీ ప్రీత్ సింగ్ పైనే అనేక విష‌యాలు నిన్న మొన్న‌టి వ‌రకు అటు ప్ర‌ముఖ మీడియా హౌస్‌లు స‌హా సోష‌ల్ మీడియాలోనూ ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. ఆమె పైపైకి మాత్ర‌మే డేరా బాబాకి ద‌త్త పుత్రిక అని, కానీ తెర వెనుక మాత్రం బాబాకు అన్నీ అయి.. అన్ని విధాలా సేవ చేస్తుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అంతేకాదు, తాను జైల్లో మ‌న‌స్సాంతిగా ఉండాలంటే.. హ‌నీని త‌న‌తో ఉంచాలంటూ.. కోర్టులో బాబా పిటిష‌న్ వేయ‌డాన్ని బ‌ట్టి ఈ వార్త‌లు నిజ‌మేనేమో అనేలా కూడా అనిపించింది.

అదేవిధంగా హ‌నీనే ఇక‌, బాబా వార‌సురాల‌ని కూడా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. వేల కోట్ల డేరా స‌చ్చ సౌదా కు హ‌నీ ఇక కాబోయే సాధ్వి అని వార్త‌లు వ‌చ్చాయి. అయితే, వీటిలో నిజాలెన్ని, పుకార్లెన్ని? అని త‌ర‌చిచూస్తే.. ఏదీ మ‌న‌కు అటు నిజ‌మ‌ని, అబ‌ద్ధ‌మ‌ని చెప్పే ప‌రిస్థితి క‌నిపించ‌దు. ఈ క్ర‌మంలోనే మ‌రి నిజాలు వెలుగు రావాలంటే ఏంచేయాలి? అని అధికారులు సైతం త‌ల‌లు ప‌ట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఓ టీవీ చానెల్ హ‌నీకి సంబంధించిన ఓ డైరీని వెలుగులోకి తెచ్చింది. ఆ డైరీలోని అంశాలే ఇప్పుడు హ‌నీ అస‌లు రూపాన్ని బ‌య‌ట పెట్టింది. మ‌రి అదేంటో చూద్దాం పదండి.

  సుమారు 20 ఏళ్ల క్రితం, అంటే తన పెళ్లికి ఓ ఏడాది ముందు 1998లో హ‌నీ రాసుకున్న డైరీ ఒకటి లభ్యమైంది. తన పేరు ప్రియాంకా తనేజా ఉరఫ్ అను అని రాసుకుంది. అను (ఏఎన్ యూ) అంటే అట్రాక్టివ్, నాటీ, ఆన్ఫార్చ్యునేట్లీ గర్ల్ అని రాసుకుంది. కాబోయే భర్త విశ్వాస్ గుప్తాను ప్రస్తావించింది. కాజోల్ ఫోటో అతికించుకుంది. అప్పటి సల్మాన్ చిత్రం 'జబ్ ప్యార్ కిసీసే హోతా హై' పోస్టర్ ను అతికించుకుంది. రామ్ రహీంపై తన అభిమానాన్ని తెలుపుతూ ఓ గీతాన్ని రాసింది. కొన్ని కవితలు కూడా ఈ డైరీలో ఉన్నాయి. డైరీలోని మొత్తం 103 పేజీలు తమకు లభ్యమైనాయని సదరు చానల్ వెల్లడించింది. అయితే, ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే.. ఇందులో రాతలు ఆమె స్వయంగా రాసిందా? అన్న విషయమై స్పష్టత లేక‌పోవ‌డ‌మే!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు