‘అర్జున్ రెడ్డి’ కి ‘అరుంధ‌తి’ ఫిదా!

‘అర్జున్ రెడ్డి’ కి ‘అరుంధ‌తి’ ఫిదా!

వివాదాల‌తో మొద‌లైన అర్జున్ రెడ్డి సినిమా ఇటు తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్సీస్ లో కూడా రికార్డు క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను త‌మిళ‌, హిందీ బాషల్లో రీమేక్ చేసేందుకు ధ‌నుష్‌, ర‌ణ‌వీర్ క‌పూర్ లు ఆస‌క్తి చూపుతున్నారు.

ఈ సినిమాపై రామ్ గోపాల్ వ‌ర్మ‌, రాజమౌళి, మ‌హేష్ బాబు, రాణా, నాని వంటి సెల‌బ్రిటీలంద‌రూ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. అర్జున్ రెడ్డి పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ అద్భుతంగా న‌టించాడ‌ని, ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి ఈ సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించాడ‌ని కితాబిచ్చారు. తాజాగా ఈ జాబితాలోకి ప్ర‌ముఖ హీరోయిన్ అనుష్క చేరింది. అది త‌ప్ప‌క చూడ‌వ‌ల‌సిన సినిమా అని స్వీటీ చెప్పింది. త‌న ఫేస్ బుక్ ఖాతాలో ఈ సినిమా గురించి త‌న అభిప్రాయాన్ని పోస్ట్ చేసింది.

‘అర్జున్ రెడ్డి’ పై అరుంధ‌తి ప్ర‌శంస‌లు కురిపించింది. త‌న ఫేస్ బుక్ లో ఈ సినిమా అద్భుతంగా ఉంద‌ని పోస్ట్ చేసింది. ఈ సినిమాను త‌ప్ప‌కుండా చూడాల‌ని కోరింది. ఈ చిత్రంలో న‌టించిన న‌టీన‌టులంద‌రికీ  నిజాయితీగా, మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాన‌ని చెప్పింది. ఈ చిత్ర నిర్మాత‌, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, విజయ్ దేవరకొండ, షాలిని పాండే, రాహుల్ రామకృష్ణ, ఈ చిత్రంలో నటించిన ప్రతి ఆర్టిస్ట్ కు త‌న అభినంద‌న‌ల‌ను తెలిపింది.

ఈ చిత్రంలోని ప్ర‌తి ఒక్క‌రూ చాలా బాగా న‌టించార‌ని స్వీటీ చెప్పింది. ఈ సంద‌ర్భంగా ఫేస్ బుక్ లో ‘అర్జున్ రెడ్డి’ పోస్టర్ ను అనుష్క‌ పోస్ట్ చేసింది. అనుష్క పోస్ట్ కు అభిమానులు ఫిదా అయ్యారు. అర్జున్ రెడ్డి సినిమా చాలా బాగుంద‌ని, సూప‌ర్బ్ అని, ఈ సినిమాను మీరు ప్ర‌మోట్ చేసినందుకు థ్యాంక్స్ అని నెటిజ‌న్లు కామెంట్లు చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు