హీరోనా, బ్యాక్‌ టు పెవిలియనా?

హీరోనా, బ్యాక్‌ టు పెవిలియనా?

కమెడియన్‌ వేషాలు మానేసి హీరోగా సెటిల్‌ అయిపోయిన సునీల్‌కి ఏ తరహా సినిమాలు చేయాలనే కన్‌ఫ్యూజన్‌ వల్ల వరుస పరాజయాలు వచ్చాయి. కామెడీ వేషాలు వేయడం మానేసి కమర్షియల్‌ హీరోగా చూడమంటూ చేసిన చిత్రాలని ప్రేక్షకులు తిప్పి కొట్టేసరికి సునీల్‌ అయోమయంలో పడ్డాడు.

టాప్‌ డైరెక్టర్లు తనతో పని చేయడానికి ఇష్టపడకపోవడం, యువ దర్శకులు తనకి తగ్గ కథలు రాయకపోవడంతో ప్రతి సినిమాకీ కథ విషయంలో తంటాలు పడుతోన్న సునీల్‌ మరోసారి హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. దసరాకి పెద్ద సినిమాల సందడి మొదలయ్యే ముందు ఒక వారం గ్యాప్‌ వుండడంతో సునీల్‌ నటించిన 'ఉంగరాల రాంబాబు'ని సెప్టెంబర్‌ 15న విడుదల చేస్తున్నారు. జై లవకుశ సెప్టెంబర్‌ 21 రానుండగా, ఈలోగా ఈ చిత్రంతో మంచి మార్కులు కొట్టేసి, దసరా సీజన్‌ని క్యాష్‌ చేసుకోవాలని చూస్తున్నాడు.

అయితే ఈ చిత్రం కానీ ఫ్లాపయితే ఇక సునీల్‌ హీరోగిరీపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఈ టైమ్‌లో హిట్టిస్తే తన కెరియర్‌కి ఏ ఢోకా వుండదు కానీ, మరోసారి పల్టీ కొడితే తిరిగి కామెడీ పాత్రలపై సునీల్‌ ఫోకస్‌ పెట్టాల్సి వస్తుంది. తను కామెడీ పాత్రలు మానేయడంతో చాలా మంది కొత్త కమెడియన్లు పుట్టుకొచ్చి రెండు చేతులా సంపాదిస్తున్నారు. సునీల్‌ ఏమో గ్యారెంటీ కెరియర్‌ వదిలేసుకుని హీరోగా నిలదొక్కుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు