అల్లు అర్జున్‌ గెటప్‌ అదిరిపోయిందట

అల్లు అర్జున్‌ గెటప్‌ అదిరిపోయిందట

'నా పేరు సూర్య' చిత్రంలో అల్లు అర్జున్‌ సరికొత్త గెటప్‌లో కనిపించబోతున్నాడట. ఈ లుక్‌ని ఇంతవరకు రివీల్‌ చేయలేదు. ఆగస్టు 15కి ఫస్ట్‌ లుక్‌ ఇద్దామని అనుకున్నారు కానీ మరీ చాలా ఎర్లీగా ఫస్ట్‌ లుక్‌ వచ్చేసినట్టవుతుందని డ్రాప్‌ అయ్యారు. ఇందులో అల్లు అర్జున్‌ సైనికుడిగా కనిపించబోతున్నాడు. ఈ లుక్‌ కోసం విదేశీ స్టయిలిస్టులు వచ్చారని ఆమధ్య వార్తలు వచ్చాయి. అల్లు అర్జున్‌ లుక్‌ గురించి ఎలాంటి డీటెయిల్స్‌ లేకపోయినప్పటికీ ఈ చిత్రం సెట్లోకి కొత్తగా వెళ్లిన కమెడియన్‌ వెన్నెల కిషోర్‌ స్టయిలిష్‌ స్టార్‌ న్యూ లుక్‌ గురించి గొప్పగా చెప్పాడు.

ఈ చిత్రంతో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ మరి అల్లు అర్జున్‌ని ఎంత కొత్తగా ప్రెజెంట్‌ చేస్తున్నాడనేది తెలియడానికి మరికొంత కాలం వేచి చూడాలి. కానీ వెన్నెల కిషోర్‌ ఇచ్చిన ఇన్‌ఫర్మేషన్‌తో అల్లు అర్జున్‌ న్యూ లుక్‌ చూడాలని ఫాన్స్‌ ఉబలాటపడుతున్నారు. ప్రతి సినిమాలోను హెయిర్‌ స్టయిల్‌, డ్రస్సింగ్‌ పరంగా కొత్తదనం చూపించే అల్లు అర్జున్‌ తన లుక్స్‌ని దాచి పెట్టడానికి ఇష్టపడడు. మరి ఈసారి తన పద్ధతికి భిన్నంగా లుక్‌ సీక్రెట్‌గా వుంచాడంటే ఇది స్పెషల్‌ మేకోవర్‌ అనే అనుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు