కంగన.. ఎందుకిలా చేస్తోంది?

కంగన.. ఎందుకిలా చేస్తోంది?

రెండు మూడు రోజులుగా బాలీవుడ్లో హాట్ టాపిక్.. హృతిక్ రోషన్, ఆదిత్య పంచోలిల మీద కంగనా రనౌత్ చేసిన ఆరోపణలే. హృతిక్ ప్రేమ పేరుతో తనను ఎలా మోసం చేసి డ్రామా ఆడింది.. ఆదిత్య పంచోలి కెరీర్ ఆరంభంలో తనను ఎలా హింసించింది వివరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది కంగనా. అన్ని రకాల మీడియాల్లోనూ ఇది హాట్ టాపిక్ అయింది. కంగనా మామూలుగా చాలా ఓపెన్‌గా మాట్లాడుతుంది కాబట్టి ఆమె ఆరోపణలు వాస్తవమే అనుకుంటున్నారంతా. ఐతే ఆ ఆరోపణల్లో వాస్తవమెంత అన్నది పక్కన పెడితే.. అసలు కంగనా పార్ట్‌లు పార్ట్‌లుగా ఈ ఎపిసోడ్‌ను ఎందుకు నడిపిస్తోందన్నది ప్రశ్న.

కంగనా ఆరు నెలల కిందట కూడా హృతిక్ రోషన్ మీద ఇలాంటి ఆరోపణలే చేసింది. దీంతో పాటు బాలీవుడ్లో వారసత్వం, బంధుప్రీతి గురించి కూడా ఆమె మాట్లాడింది. వీటి గురించి కొంత చర్చ నడిచింది. ఆ తర్వాత అందరూ మరిచిపోయారు. ఇప్పుడు మళ్లీ ఆమె ఒక షోలో ఇంకొంచెం డోస్ పెంచి ఆరోపణలు చేసింది. డీటైలింగ్ ఇచ్చింది. ఐతే కంగన ఇంతకుముందు ఆరోపణలు చేసిన సమయంలో ఆమె సినిమా ‘రంగూన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. దాని ప్రమోషన్లలో ఉన్నపుడే కంగనా ఈ ఆరోపనలు చేసింది. ఇప్పుడు కంగన కొత్త సినిమా ‘సిమ్రాన్’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాకు హైప్ తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా పబ్లిసిటీ కోసమే ఆమె ఈ టాపిక్ గురించి మాట్లాడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కంగన తర్వాతి సినిమాకు ముందు కూడా ఈ టాపిక్‌ను లేవనెత్తడం.. కొత్త కొత్త ఆరోపణలు చేయడం ఖాయమని.. ఈ అంశాన్ని తన సినిమాల ప్రమోషన్‌కు ఆమె ఉపయోగించుకుంటోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు