ఫ్లాప్‌ హీరోకి చివరి హోప్‌

ఫ్లాప్‌ హీరోకి చివరి హోప్‌

అల్లరి నరేష్‌కి లాస్ట్‌ హిట్‌ వచ్చి చాలా కాలమైంది. ఒకప్పుడు మినిమం గ్యారెంటీ హీరోగా మన్ననలు అందుకున్న నరేష్‌ చిత్రాలని కొనే నాధుడే లేడిపుడు. విడుదలకి ముందు ప్రామిసింగ్‌గా అనిపించిన సినిమాలు కూడా డిపాజిట్లు కోల్పోయేసరికి అతని చిత్రాలు కొనడానికి బయ్యర్లు ఆసక్తి చూపించడం లేదు.

ఈ నేపథ్యంలో అల్లరి నరేష్‌ కొత్త సినిమా 'మేడ మీద అబ్బాయి' ఈ శుక్రవారం రిలీజ్‌ అవుతోంది. ఈ చిత్రం సోలో రిలీజ్‌ కాకుండా నాగచైతన్య చిత్రం 'యుద్ధం శరణం'తో పోటీ పడుతోంది. మలయాళ హిట్‌ చిత్రానికి రీమేక్‌ అయిన 'మేడ మీద అబ్బాయి' ప్రోమోస్‌ బాగున్నా కానీ నరేష్‌ చిత్రానికి వసూళ్లు వస్తాయని బయ్యర్లు నమ్ముతున్నట్టు లేరు.

విడుదలకి మరో రెండు రోజులే వున్నా కానీ ఇంతవరకు ఎలాంటి బజ్‌ తెచ్చుకోలేకపోయిన ఈ చిత్రం కనీసం విడుదల అయిన తర్వాత అయినా జనాల నోళ్లల్లో నలుగుతుందో లేదో మరి. చాలా మంది కొత్త హీరోలు వచ్చేయడంతో అల్లరి నరేష్‌ చిత్రాలకి గిరాకీ పడిపోయింది.

దానికి తోడు రాంగ్‌ టైమ్‌లో ఫ్లాప్‌ల బారిన పడడంతో మళ్లీ లేవలేకపోతున్నాడు. ఈ చిత్రం కనుక అటు ఇటు అయితే నరేష్‌కి కొత్త అవకాశాలు రావడం కూడా కష్టమైపోయే ప్రమాదముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు