ప్రభాస్‌కి డైరెక్టర్లు కావలెను

ప్రభాస్‌కి డైరెక్టర్లు కావలెను

బాహుబలితో జాతీయ వ్యాప్త గుర్తింపు రావడం మాటేమో కానీ దానిని నిలబెట్టుకోవడానికి ప్రభాస్‌ నానా తంటాలు పడాల్సి వస్తోంది. సరాసరి హిందీ సినిమా చేయలేడు కనుక తను చేసే తెలుగు సినిమాలతోనే జాతీయ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాలి. అయితే రీజనల్‌ సినిమాలో నటించడానికి బాలీవుడ్‌ భామలు ఇష్టపడరు.

అలాగే టాప్‌ యాక్టర్లు ఎవరూ దొరకరు. ప్రభాస్‌కి వున్న ఆప్షనల్లా భారతదేశమంతా తెలిసిన దర్శకులతో పని చేయాలి. కానీ అలాంటి డైరెక్టర్లు ఎంత మంది వున్నారు. వున్నా వారిలో ఇప్పుడెందరు ప్రభాస్‌కి దొరుకుతారు. సాహో చిత్రానికి జాతీయ వ్యాప్త ప్రచారం తీసుకురావడం కోసం ప్రభాస్‌ పడని కష్టం లేదు.

శ్రద్ధాకపూర్‌తో పాటు చాలా మంది బాలీవుడ్‌ నటులని ఈ చిత్రంలో తీసుకున్నారు కానీ ఇదేమీ బాహుబలి తరహా ప్రత్యేకమైన చిత్రం కాదు కనుక సాహోని అక్కడి మీడియా కానీ, జనాలు కానీ పట్టించుకోవడం అంత ఈజీ కాదు. అందుకే ఇకపై చేసే సినిమాలకి అయినా కానీ పేరున్న దర్శకుడినే పెట్టుకోవాలని అనుకుంటున్నాడు.

ఇందుకోసం మురుగదాస్‌ని సంప్రదించి చర్చించాడని, శంకర్‌ని కలిసే ఆలోచనలో వున్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ప్రభాస్‌తో వీళ్లు పని చేయడానికి ఓకే చెప్పినా కానీ ఆ సినిమాలు తెర మీదకి రావడానికి కొన్నేళ్ల సమయం పడుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు