డైల‌మాలో ప‌డ్డ చెర్రీ?

డైల‌మాలో ప‌డ్డ చెర్రీ?

ధ్రువ చిత్రంతో హిట్ అందుకున్న రామ్ చ‌ర‌ణ్ త‌న త‌ర్వాతి చిత్రం  'రంగస్థలం 1985' పై మెగా అభిమానుల‌కు భారీ అంచ‌నాలున్నాయి. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. కంప్లీట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సుకుమార్ రూపొందిస్తున్న‌ ఈ సినిమా సంక్రాంతి బ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.  రంగ‌స్థ‌లం త‌ర్వాత త‌న‌కు ఓ సినిమా చేయ‌మ‌ని నిర్మాత దాన‌య్య చెర్రీని అడుగుతున్నార‌ట‌. ఈ ఈ సినిమాకు బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశ‌ముంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న 'సైరా నరసింహా రెడ్డి' సినిమాకు చ‌ర‌ణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. చారిత్ర‌క నేప‌థ్యంలో రాబోతున్న చిరు 151వ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించాల‌ని చెర్రీ భావిస్తున్నాడు. బాహుబ‌లి త‌రహాలో పాన్ ఇండియా అప్పీల్ రావడం కోసం ఈ సినిమాలో బాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్ స్టార్ కాస్టింగ్ ను ఎంచుకున్నాడు చెర్రీ. బాహుబ‌లి త‌రహాలో ఈ సినిమాకు అంత‌ర్జాతీయ గుర్తింపు తీసుకురావాల‌ని చెర్రీ, చిరు అనుకుంటున్నారు. అయితే, ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి క‌నీసం ఏడాదైనా పడుతుంది. అప్పటివరకూ  ఆ సినిమా నిర్మాణ బాధ్య‌త‌లను చూసుకోవాలా? ఓ ప‌క్క నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తూనే దాన‌య్య సినిమాలో న‌టించాలా? అన్న విష‌యంలో చెర్రీ డైల‌మాలో ప‌డ్డాడ‌ట‌. మ‌రి ఈ డైల‌మాను ఛేదించుకుని సైరాకు ఫుల్ టైమ్ నిర్మాత‌గా ఉంటాడా, లేక హీరో, నిర్మాత‌గా కొన‌సాగుతాడా అన్నది తేలాల్సి ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English