బిగ్‌బాస్‌ కోసం వేట మొదలు

బిగ్‌బాస్‌ కోసం వేట మొదలు

బిగ్‌బాస్‌ ఫస్ట్‌ సీజన్‌ చివరి దశకి చేరుకోవడంతో మలి సీజన్‌లో ఆడే కంటెస్టెంట్స్‌ కోసం వేట మొదలైంది. ఫస్ట్‌ సీజన్‌లో చెప్పుకోతగ్గ కంటెస్టెంట్లు లేకపోవడంతో షో రసవత్తరంగా సాగలేదు. ఒకరిద్దరు తమ తెలివితేటలు, టాలెంట్‌తో షోని హోల్డ్‌ చేయగలిగారు కానీ రియల్‌గా ఈ షోకి వన్నె తెచ్చిన వారయితే లేరు.

ఆరంభంలో టీఆర్పీలు తారాస్థాయిలో రాగా, తర్వాత రేటింగులు పడిపోవడాన్ని బట్టే షో నీరసించిందని అర్థమవుతోంది. సాధారణంగా ఏ షో అయినా చివరి దశకి చేరుకునే కొద్దీ ఆసక్తి పెంచాలి. కానీ బిగ్‌బాస్‌ విషయంలో అది రివర్స్‌ అయింది. ఎన్టీఆర్‌ వారానికి రెండు రోజులు మాత్రమే కనిపిస్తాడు కనుక అయిదు రోజుల పాటు దీనిని నడిపించే శక్తి కంటెస్టెంట్స్‌కి వుండాలి.

అలాంటి వాళ్లు నలుగురైదుగురు అయినా వుండేట్లు చూడమని ఎన్టీఆర్‌ టీమ్‌ బిగ్‌బాస్‌ నిర్వాహకులకి చెప్పిందట. ఆసక్తికరమైన ఆటగాళ్లు లేకుండా దీనిని ఎక్కువ కాలం నడిపించలేమని, మీలో ఎవరు కోటీశ్వరుడు షో మొదటి సీజన్‌లో క్లిక్‌ అయి తర్వాత నీరసించిపోవడం ఉదాహరణగా చెప్పి, ఆడియన్స్‌ ఇంట్రెస్ట్‌ని హోల్డ్‌ చేయాల్సిన బాధ్యత మీపై వుందని గుర్తు చేసారట. దీంతో ఇప్పట్నుంచే రెండవ సీజన్‌ కోసం వేట మొదలు పెట్టారని తెలిసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు