చిరును పూరీ వ‌దిలే ప్ర‌స‌క్తే లేద‌ట‌!

చిరును పూరీ వ‌దిలే ప్ర‌స‌క్తే లేద‌ట‌!

చాలా గ్యాప్ త‌ర్వాత వ‌చ్చిన మెగాస్టార్ 150 వ చిత్రానికి పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడ‌ని అప్ప‌ట్లో టాక్ వినిపించింది. అయితే, చిరు 150 వ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఛాన్స్ ను వి.వి.వినాయ‌క్ కొట్టేశాడు. పూరీ చెప్పిన క‌థ చిరుకు న‌చ్చ‌క‌పోవ‌డంతోనే ఆ చాన్స్ ను పూరీ మిస్స‌య్యాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

ఇదే విష‌యంపై పూరీ జ‌గ‌న్నాథ్ మ‌రోసారి క్లారిటీ ఇచ్చాడు. ఓ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా చిరంజీవితో ఆ సినిమా ఎందుకు మిస్స‌య్యానో చెప్పేశాడు. భ‌విష్య‌త్తులో త‌న అభిమాన హీరో చిరుతో త‌ప్ప‌క సినిమా తీస్తాన‌న్నాడు. చిరంజీవిని ఎట్టి ప‌రిస్థితుల్లో వ‌దిలేది లేద‌ని కాన్ఫిడెంట్ గా చెప్పాడు పూరీ.

తాను చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగానని, చిరు వీరాభిమానిగా ఆయన సినిమాలు ఎలా ఉండాలో త‌న‌కు తెలుస‌ని పూరీ చెప్పాడు. ఒక దర్శకుడిగా చిరంజీవిని ఎలా ప్రొజెక్ట్ చేయాల‌నే విషయంలో తనకు ఒక స్పష్టమైన విజన్ ఉంద‌న్నాడు. మెగాస్టార్ స్ధాయికి త‌గ్గ సినిమానే తాను చేస్తాన‌ని చెప్పాడు. తాను చిరంజీవికి 'ఆటో జానీ' కథ వినిపించాన‌ని, ఆ క‌థ ఆయ‌న‌కు బాగా న‌చ్చింద‌ని తెలిపాడు.

అయితే ఆయన ఆ సినిమా చేయకుండా కొంతమంది ప్రభావితం చేశారని చెప్పాడు. 3 నెలల క్రితం చిరంజీవికి మరో కథ వినిపించాననీ, ఈ కథ కూడా ఆయనకు బాగా నచ్చిందన్నాడు. ఆ క‌థ‌ను పెట్టి చిరుతో తప్పకుండా సినిమా చేస్తానని చెప్పాడు. 'సైరా నరసింహా రెడ్డి'  తరువాత బోయపాటి దర్శకత్వంలో చిరు న‌టించ‌బోతున్నారు. ఆ సినిమా త‌ర్వాత పూరీ సినిమా ప‌ట్టాలెక్కుతుందేమో చూడాలి. ప్ర‌స్తుతం పైసా వసూల్ తో మ‌రో ప్లాప్ ను మూట‌గ‌ట్టుకున్న పూరీకి చిరు ఛాన్స్ ఇస్తాడా ? లేదా? అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు