ఫ్యామిలీతో నిమ‌జ్జ‌నానికి వ‌చ్చిన సూప‌ర్ హీరో

ఫ్యామిలీతో నిమ‌జ్జ‌నానికి వ‌చ్చిన సూప‌ర్ హీరో

గ‌ణేష్ నిమ‌జ్జ‌నం అత్యంత వైభ‌వంగా జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. దేశంలోని ప‌లు ప్ర‌ముఖ న‌గ‌రాల్లో నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మం భారీగా సాగుతోంది.

ముంబ‌యిలో సాగుతున్న నిమ‌జ్జ‌న మ‌హోత్స‌వ వేళ‌.. ఊహించ‌ని రీతిలో బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ ఖాన్‌.. త‌న భార్య గౌరీఖాన్‌.. కొడుకు అభిరామ్ ను తీసుకొని నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మానికి రావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

వైట్ క‌ల‌ర్ టీ ష‌ర్ట్.. బ్లూక‌ల‌ర్ షార్ట్ ధ‌రించిన షారుఖ్ కుమారుడు అభిరామ్ తండ్రి చంక దిగ‌లేద‌ని చెబుతున్నారు. నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మం చివ‌ర్లో అభిరామ్ కింద‌కు దిగాడు.

షారుక్ స‌తీమ‌ణి గౌరీఖాన్ కూడా ఉత్సాహంగానిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన‌టంతో అభిమానులు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. భారీ జ‌న‌సందోహం న‌డుమ బాలీవుడ్ బాద్షా ఫ్యామిలీ హుషారుగా తిర‌గ‌టం క‌నిపించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు