ప్ర‌భాస్‌, శ్ర‌ద్ధా క‌పూర్ ల ఒప్పందం!

ప్ర‌భాస్‌, శ్ర‌ద్ధా క‌పూర్ ల ఒప్పందం!

బాహుబ‌లి త‌ర్వాత ప్రభాస్ న‌టిస్తున్న 'సాహో' చిత్రంపై ప్రేక్ష‌కులకు భారీ అంచ‌నాలున్నాయి. ఈ సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న హీరోయిన్ కోసం నిర్మాత‌లు చాలా క‌స‌ర‌త్తు చేశారు. చివ‌ర‌కు బాలీవుడ్ హీరోయిన్ శ్ర‌ద్ధా క‌పూర్ ను ఎంచుకున్నారు. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ కు ఉన్న క్రేజ్ ప్ర‌కారం ఈ సినిమాను హిందీ, తెలుగు భాష‌ల్లో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

అయితే, 'సాహో' షూటింగ్ గురించి ప్ర‌భాస్‌, శ్ర‌ద్ధా క‌పూర్‌లు ఇద్ద‌రూ ఓ ఒప్పందం చేసుకున్నారట‌. తెలుగులో శ్ర‌ద్ధా క‌పూర్ కు ఇదే తొలి సినిమా. ప్ర‌భాస్ కు హిందీలో ఇదే మొద‌టి చిత్రం. దీంతో, డైలాగులు  ప‌ల‌క‌డంలో ఇద్ద‌రూ ఒక‌రికొక‌రు స‌హ‌క‌రించుకోవాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌.

తెలుగులో డైలాగ్ లు చెప్పేట‌పుడు శ్ర‌ద్ధాకు ప్ర‌భాస్‌, హిందీ డైలాగ్ లు చెప్పేట‌పుడు ప్ర‌భాస్ కు శ్ర‌ద్ధ‌ సహాయం చేసుకోవాల‌ని ఒప్పందం చేసుకున్నార‌ట‌. షూటింగ్ స‌మ‌యంలో కూడా వీరిద్ద‌రి సంభాష‌ణ హిందీ, తెలుగులో సాగ‌నుంద‌ట‌. అయితే, వీరిద్ద‌రికీ ప్ర‌త్యేకంగా భాష అనువాద‌కులు మాత్రం య‌థాత‌థంగా కొన‌సాగుతారు. ఈ సినిమాను తెలుగు, హిందీ భాష‌ల్లో ఒకేసారి షూట్ చేయ‌నున్నారు.

దీంతో, ప్ర‌తి సీన్‌ను రెండు సార్లు షూట్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. 'సాహో'లో ప్ర‌భాస్ సొంతంగా హిందీలో డ‌బ్బింగ్ చెప్పుకునే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది. శ్ర‌ద్ధా క‌పూర్ కు డ‌బ్బింగ్ చెప్పించ‌నున్న‌ట్లు స‌మాచారం. సాహోలో జాకీ ష్రాఫ్‌, చుంకీ పాండే, మందిరా బేడీ, నీల్ నితిన్ ముకేష్ న‌టిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు