కథ నచ్చకపోతే అబద్ధాలు చెప్పడట

కథ నచ్చకపోతే అబద్ధాలు చెప్పడట

'అర్జున్ రెడ్డి' సినిమాతో తాను కెరీర్ మొత్తానికి సరిపోయే పాఠాలు నేర్చుకున్నానని అంటున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా తన వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేసిందని.. ఏదనిపిస్తే అది మాట్లాడాలని.. ఏదనిపిస్తే అది చేయాలని తాను ఫిక్సయినట్లు అతను వెల్లడించాడు.

తాను ఇకపై కథల ఎంపికలో జాగ్రత్తగా ఉంటానని.. తనకు నప్పే పాత్రలు మాత్రమే ఎంచుకుంటానని.. కథలు నచ్చకపోతే ఆ విషయాన్ని చెప్పడానికి ఎంతమాత్రం మొహమాటపడనని అతను స్పష్టం చేశాడు.

''ఇంతకుముందు కథ నచ్చకపోతే చెప్పడానికి మొహమాటపడేవాడిని. ఇప్పుడా ఇబ్బంది లేదు. కథ నచ్చలేదని మొహమాటం లేకుండా చెప్పేస్తా. అంతే కానీ.. డేట్లు ఖాలీ లేవని.. ఇంకోటని కారణాలు చెప్పను. నాకు ఎలాంటి పాత్రలు నప్పుతాయో నాకు అర్థమైంది. రియలిస్టిగ్గా ఉండే పాత్రలు.. సినిమాలే చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి కూడా అలాగే ఉంది. లార్జర్ దన్ లైఫ్ క్యారెక్టర్లు నాకు ఎంతమాత్రం సరిపడవు. అలాంటి పాత్రలు నేను చేస్తే జనాలు త్వరగా మరిచిపోతారు.

అలాంటి పాత్రలతో కంటే వాస్తవికంగా అనిపించే పాత్రలకే ఇప్పటి ప్రేక్షకులు ఎక్కువగా కనెక్టవుతున్నారు. అలాంటి పాత్రల్లో తమను తాము చూసుకుంటున్నారు. అర్జున్ రెడ్డి పాత్ర అలాంటిదే. కాబట్టి పాత్రలు, కథల ఎంపికలో జాగ్రత్తగా ఉంటాను. మొహమాటంతో సినిమాలు చేసే ప్రసక్తే లేదు'' అని విజయ్ దేవరకొండ స్పష్టం చేశాడు. విజయ్ ప్రస్తుతం రాహుల్ సాంకృత్యన్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు భరత్ కమ్మ అనే డెబ్యూ డైరెక్టర్‌తోనూ పని చేస్తున్నాడు. నందిని రెడ్డి, పరశురామ్‌ల దర్శకత్వంలోనూ సినిమాలు చేయబోతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు