అర్జున్‌రెడ్డిపై పెద్దోళ్ల కన్ను

అర్జున్‌రెడ్డిపై పెద్దోళ్ల కన్ను

బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించడమే కాకుండా ఇతర భాషా చిత్ర పరిశ్రమల దృష్టిని కూడా అర్జున్‌ రెడ్డి అమితంగా ఆకట్టుకుంది. మామూలుగా ఇంత లో బడ్జెట్‌ చిత్రాల గురించి వేరే భాషల వాళ్లు ఆసక్తి చూపించరు. కానీ అర్జున్‌ రెడ్డి మహామహుల ప్రశంసలు అందుకోవడంతో పాటు తెలుగు చిత్ర సీమలో ఒక రెవల్యూషనరీ సినిమాగా జాతీయ మీడియా నుంచి ఫుల్‌ పబ్లిసిటీ పొందింది.

దీంతో ఈ చిత్రంపై పలువురు పెద్దవాళ్లు దృష్టి పెట్టారు. తెలుగులో చిన్న హీరోతో చిన్న సినిమాగా తెరకెక్కిన అర్జున్‌ రెడ్డి ఇతర భాషల్లో భారీ చిత్రంగా షేప్‌ తీసుకునేటట్టు కనిపిస్తోంది. ఇప్పటికే తమిళ హక్కులని ధనుష్‌ తీసుకున్నాడు. అర్జున్‌ రెడ్డి పాత్ర తనే చేయాలనే కోరిక వెలిబుచ్చాడు. తనే చేస్తాడా లేక మరెవరైనా యువ నటుడితో తీస్తాడా అనేది చూడాలి. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ చూసేందుకు షో అరేంజ్‌ చేయమన్నాడు.

రణ్‌వీర్‌ సింగ్‌కి వున్న ఇమేజ్‌కి ఈ పాత్రకి అతను పర్‌ఫెక్ట్‌గా సరిపోతాడు. రణ్‌వీర్‌ సింగ్‌ కానీ ఈ రీమేక్‌ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తే ఇతర భాషలనుంచి కూడా ప్రముఖ హీరోలు ఈ రీమేక్‌ కోసం పోటీ పడడం ఖాయం చేసుకోవచ్చు. బాహుబలి తర్వాత ఇతర భాషల వారి నుంచి ఇంతగా మెప్పు పొందుతోన్న తెలుగు సినిమా ఇదే. బాహుబలి అయిదు వందల కోట్ల ప్రాజెక్ట్‌ కాగా, అర్జున్‌ రెడ్డికి అయిదు కోట్లు కూడా ఖర్చు పెట్టకపోవడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు