మహేష్‌ కోసం ఇలియానానా... నో నో!

మహేష్‌ కోసం ఇలియానానా... నో నో!

మహేష్‌బాబుతో వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్న చిత్రంలో కథానాయికగా ఇలియానా నటిస్తోందనే ప్రచారం మొదలైంది. పోకిరి కాంబినేషన్‌ రిపీట్‌ అవుతోందని, ఇలియానా మళ్లీ బాలీవుడ్‌ నుంచి తిరిగి తెలుగు చిత్ర పరిశ్రమకి రానుందని రూమర్లు బాగా వినిపిస్తున్నాయి.

వీటికి తెర వేస్తూ ఇందులో ఇలియానా నటించడం లేదని నిర్మాత దిల్‌ రాజు తేల్చేసాడు. ఇలియానా పేరుని పరిశీలించలేదని, అసలు ఆమెని సంప్రదించే ఆలోచన కూడా లేదని ఇంతటితో ఈ పుకార్లకి తెర దించేసాడు. కొరటాల శివతో చేస్తోన్న 'భరత్‌ అనే నేను' షూటింగ్‌ పూర్తి కాగానే ఇది సెట్స్‌ మీదకి వెళుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలయ్యే అవకాశాలున్న ఈ చిత్రం కోసం ఇంకా హీరోయిన్‌ని ఫిక్స్‌ చేయలేదు.

ప్రస్తుతం టాప్‌ రేంజ్‌లో వున్న హీరోయిన్‌నే తీసుకుంటారని అనుకుంటూ వుండగా, 'డిజె' ఫేమ్‌ పూజా హెగ్డేకి ఛాన్స్‌ వుందని మరో టాక్‌ వుంది. 'డిజె' చిత్రం సమయంలోనే పూజతో మరో రెండు సినిమాలకి దిల్‌ రాజు ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. స్పైడర్‌తో మహేష్‌కి తమిళంలో, హిందీలో మార్కెట్‌ ఏర్పడినట్టయితే ఈ చిత్రాన్ని కూడా మల్టిపుల్‌ లాంగ్వేజెస్‌లో చేసేలా ప్లాన్‌ చేసుకుంటారట. అందుకే ప్రస్తుతానికి ఇతర కాస్టింగ్‌ మీద అంతగా ఫోకస్‌ చేయడం లేదట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు