మంచు మనోజ్ వెనక్కి తగ్గాడు

మంచు మనోజ్ వెనక్కి తగ్గాడు

మంచు మనోజ్ కొత్త సినిమా 'ఒక్కడు మిగిలాడు'ను సెప్టెంబరు 8న రిలీజ్ చేయబోతున్నట్లు రెండు నెలల కిందటే ప్రకటించారు. ఈ తేదీకి ఇంకో రెండు సినిమాలు కూడా లైన్లో ఉన్నప్పటికీ ముందుగా రిలీజ్ డేట్ కన్ఫమ్ చేసుకున్నది ఈ చిత్రమే. ఐతే రిలీజ్ వీక్‌లోకి అడుగుపెట్టినప్పటికీ ఈ సినిమాకు ఎలాంటి ప్రమోషన్ కనిపించట్లేదు. రెండు వారాలుగా ఈ సినిమాకు సంబంధించి ఏ అప్ డేట్ కూడా లేదు.

దీంతో అనుకున్న తేదీకి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందా రాదా అన్న సందేహాలు మొదలయ్యాయి. ఇప్పుడా సందేహాలే నిజమయ్యాయి. ఈ శుక్రవారం 'ఒక్కడు మిగిలాడు' విడుదల కావట్లేదు. ఈ చిత్రాన్ని అక్టోబరుకు వాయిదా వేస్తున్నట్లుగా చిత్ర బృందం ప్రకటించింది.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యమవుతుండటం వల్లే సినిమాను వాయిదా వేయాల్సి వస్తోందని నిర్మాతలు తెలిపారు. అక్టోబరు ద్వితీయార్ధంలో 'ఒక్కడు మిగిలాడు' విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఆ నెలలో 'రాజు గారి గది-2', 'రాజా ది గ్రేట్' లాంటి భారీ సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి.

స్వతహాగా తెలుగువాడే అయినప్పటికీ.. తమిళంలో 'రావణదేశం' అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమై మంచి పేరు సంపాదించిన అజయ్ ఆండ్రూస్ 'ఒక్కడు మిగిలాడు'కు దర్శకుడు. తొలి సినిమా మాదిరే ఇది కూడా శ్రీలంకలో తమిళుల సమస్య నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. మనోజ్ ఇందులో ఎల్టీటీఈ వ్యవస్థాపకుడు ప్రభాకరన్ పాత్రతో పాటు.. యంగ్ కాలేజీ స్టూడెంట్ క్యారెక్టర్ కూడా చేస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English