అప్పు చేసి 'అర్జున్ రెడ్డి' తీస్తే..

అప్పు చేసి 'అర్జున్ రెడ్డి' తీస్తే..

గత పది రోజులుగా టాలీవుడ్లో చర్చనీయాంశమవుతున్న సినిమా 'అర్జున్ రెడ్డి'. వారం రోజుల్లోన రూ.17 కోట్లకు పైగా షేర్ రాబట్టి సంచలనం సృష్టించిందీ సినిమా. దీనికి అయిన బడ్జెట్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ సినిమాకు బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారట దర్శకుడు సందీప్, అతడి సోదరుడు ప్రణయ్. వడ్డీతో కలిపి అది రూ.4 కోట్లు అయిందట.

ఐతే ముందు ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో బిజినెస్ కాకపోవడంతో ఈ అప్పు తీర్చడమెలా అని కంగారు పడ్డారట. అలాంటి స్థితిలో ఏషియన్ మూవీస్ వాళ్లు రంగంలోకి దిగి.. సినిమాను కొనుగోలు చేశారు. వాళ్లు ముందుగా రూ.4 కోట్ల లోన్ క్లియర్ చేసి.. అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం.

సినిమాను హోల్ సేల్‌గా రూ.5.5 కోట్లు కొనుగోలు చేసిన ఏషియన్ మూవీస్ వాళ్లు.. లాభాల్లో కూడా వాటా ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఓవర్సీస్‌కు కూడా ముందుగా రూ.50 లక్షలు పేమెంట్ చేసి హక్కులు తీసుకున్న నిర్వాణ సినిమాస్.. లాభాల్లోనూ వాటా ఇచ్చేలా ఒప్పందం కుదిరిందట. ఇప్పుడు సినిమాను కొన్న వాళ్లకు.. అమ్మిన వాళ్లకు ఇద్దరికీ భారీగా ఆదాయం వస్తోంది.

ఇరు వర్గాలూ సూపర్ హ్యాపీగా ఉన్నాయి. మరోవైపు ఈ చిత్ర డిజిటల్ ప్రసార హక్కుల్ని అమెజాన్ వాళ్లు రూ.1.6 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం విశేషం. ఇంకోవైపు ఈ చిత్ర శాటిలైట్ హక్కులకు రూ.3 కోట్లకు పైగా దక్కుతున్నట్లు సమాచారం. మొత్తానికి 'అర్జున్ రెడ్డి' సినిమాతో సందీప్ పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు అన్నీ సంపాదించుకున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు