జైల్లో శిక్ష అనుభ‌విస్తోంది న‌కిలీ డేరా?

జైల్లో శిక్ష అనుభ‌విస్తోంది న‌కిలీ డేరా?

ఇద్ద‌రు సాధ్వీల‌ను అత్యాచారం చేసిన ఉదంతంలో 20 ఏళ్ల జైలుశిక్ష అనుభ‌విస్తున్నారు డేరా చీఫ్ గుర్మీత్‌.  ఆయ‌న‌కు జైలుశిక్ష‌ను ఖ‌రారు చేసే స‌మ‌యంలో ప‌లు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించాయి. అనంత‌రం ఆయ‌న్ను సునారియా జైలులో ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. జైల్లో ఉన్న గుర్మిత్ కు సంబంధించి సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ సాగుతోంది.

బాబాకు సంబంధించిన వివిధ ఫోటోలు షేర్ చేస్తూ.. ప‌లు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఇంత‌కూ నెటిజ‌న్ల సందేహాలేమిటంటే.. శిక్ష ప‌డి జైల్లో ఉన్న గుర్మీత్ సింగ్ అస‌లు కాద‌ని.. నకిలీ ఏమోన‌న్న సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ సందేహాల‌కు త‌గ్గ‌ట్లుగా చూపిస్తున్న వివిధ ఫోటోల్ని షేర్ చేస్తున్నారు. రేప్ కేసులో శిక్ష ప‌డిన గుర్మీత్ త‌న పుట్టిన‌రోజు వేడుక‌ల్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల చివ‌రి రోజున గుర్మీత్‌ను హ‌ర్యానా రాష్ట్ర విద్యాశాఖా మంత్రి రామ్ విలాస్ శ‌ర్మ క‌లిశారు. ఈ సంద‌ర్భంగా తీసిన ఫోటోలోగుర్మీత్ త‌ల వెంట్రుక‌లు చిన్న‌గా ఉన్నాయి. అదే స‌మ‌యంలో గెడ్డం కూడా త‌క్కువ‌గానే ఉంది.

ప‌ది రోజుల అనంత‌రం సీబీఐ ప్ర‌త్యేక కోర్టుకు హాజ‌ర‌య్యే స‌మ‌యంలో డేరా బాబా క‌నిపించినప్పుడు ఆయ‌న గ‌డ్డం పొడ‌వుగా ఉంది. త‌ల‌పై జుట్టు కూడా ఎక్కువ‌గానే ఉంది. కేవ‌లం ప‌ది రోజుల్లో బాబాకు ఇంత జుట్టు పెర‌గ‌టం సాధ్య‌మ‌య్యే ప‌నా? అన్న‌ది సందేహంగా ఉంది. ఒక‌వేళ గుర్మీత్ విగ్ పెట్టుకున్నాడ‌నుకుంటే.. బ‌ర్త్ డే ఫంక్ష‌న్ స‌మ‌యంలో ఉన్న‌ది అస‌లు రూప‌మా?  కోర్టుకు వెళ్లే ముందు క‌నిపించింది అస‌లైన రూప‌మా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

ఈ రెండు ఫోటోల్లో తేడాలు స్ప‌ష్టంగా క‌నిపించ‌టంతో జైల్లో ఉన్న గుర్మీత్ అస‌లా? న‌కిలీనా? అన్న‌ది ఇప్పుడు సందేహంగా మారింది. పుట్టిన రోజు జుట్టు త‌క్కువ‌గా ఉండి.. కోర్టుకు వెళ్లే స‌మ‌యంలో జుట్టు ఎక్కువ‌గా ఉండ‌టంపై ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. జైలు అధికారులు చెప్పే దాని ప్ర‌కారం జైల్లో భోజ‌నానికి ముందు ప్ర‌తి ఖైదీని పోలీసులు నిర్ధారించిన త‌ర్వాత లోప‌ల‌కు పంపుతార‌ని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. జైలుకు వెళ్లిన త‌ర్వాత డేరా బాబాకు సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. తాను జైలుకు వెళ్ల‌నున్న విష‌యం గుర్మీత్‌కు ముందే తెలుసా? ఊహించాడా? అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తేలా ఉన్న ఒక ఉదంతాన్ని ప‌లువురు ఆస‌క్తిక‌రంగా చెప్పుకుంటున్నారు. గుర్మీత్ న‌టించిన ఒక చిత్రంలో ఒక పాట ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. హ‌ర్యానా భాష‌లో తీసిన ఈ సినిమాలో హీరోయిన్ తో బాబా.. న‌న్ను జైలుకు పంపిస్తావా? అంటూ రొమాంటిక్ గా అడ‌గ‌టం క‌నిపిస్తుంది. పాట చివ‌ర్లో బాబాకు ఆ యువ‌తి దూరంగా వెళ్లిపోవ‌టం ఉంటుంది. త‌న భవిష్య‌త్తును బాబా పాట రూపంలో చెప్పేశాడ‌న్న మాట వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు