ఇక జగన్‌ ట్రాప్‌లో పడేదెవరు?

ఇక జగన్‌ ట్రాప్‌లో పడేదెవరు?

ఎప్పుడో కొన్ని సూపర్‌హిట్‌ చిత్రాలు తీసి, వాటి పేరు మీద ఇప్పటికీ నెట్టుకొచ్చేస్తోన్న పూరి జగన్నాథ్‌ గత పదేళ్లలో చాలా ఫ్లాప్‌ సినిమాలు తీసాడు. అదే కథని తిప్పి తిప్పి తీస్తోన్న పూరి మరోసారి 'పైసా వసూల్‌'తో తీవ్రంగా నిరాశ పరిచాడు. క్రేజ్‌ తెచ్చుకున్న ఈ చిత్రం వసూళ్లు రెండవ రోజునే డ్రాప్‌ అవడాన్ని బట్టి మరోసారి పూరి ఆటలు చెల్లలేదని తెలుస్తోంది.

ఆల్రెడీ ప్రస్తుతం టాప్‌లో వున్న హీరోలు తనతో పని చేయడానికి ఇష్టం చూపించకపోయే సరికి వెటరన్‌ హీరోల వెంట పడడం మొదలు పెట్టాడు. వెంకటేష్‌తో పని జరగలేదు కానీ బాలకృష్ణ ఓకే చెప్పేసాడు. కెరియర్‌కి ప్రమాద సూచిక కనిపిస్తోంది కనుక జాగ్రత్త పడతాడని అనుకుంటే, పైసా వసూల్‌ చిత్రానికి కూడా తన పద్ధతి మార్చుకోలేదు. కథ, కథనాలు అస్సలు లేకుండా హీరో క్రేజ్‌ మీద ఆడించేయాలని చూసాడు. బాలకృష్ణ కొత్తగా కనిపించినా కానీ పూరి చెడగొట్టేసాడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇప్పుడు పూరి జగన్నాథ్‌తో పని చేయడానికి ముందుకొచ్చేదెవరు? ఫామ్‌లో వున్న యువ హీరోలు కూడా అతనితో చేయడానికి ఆసక్తిగా లేరు. సినిమా పూర్తి కాగానే మరొకటి మొదలు పెట్టాలని ఆరాటపడే పూరి జగన్నాథ్‌కి ఇప్పుడు డేట్స్‌ ఇచ్చేదెవరు? మరోసారి తన గత వైభవాన్ని నమ్మి ట్రాప్‌లో పడేదెవరు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు