సత్తా చాటిన బాలకృష్ణ

సత్తా చాటిన బాలకృష్ణ

ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రానికి మంచి ఓపెనింగ్స్‌ రాబట్టిన బాలకృష్ణ మరోసారి తనకున్న 'బాక్సాఫీస్‌ బొనాంజా' పేరుకి న్యాయం చేసారు. 'పైసా వసూల్‌' చిత్రానికి తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా దాదాపు తొమ్మిది కోట్ల షేర్‌ వచ్చింది. 'గౌతమిపుత్ర శాతకర్ణి' మొదటి రోజు గ్రాస్‌ వసూళ్ల కంటే కూడా 'పైసా వసూల్‌' గ్రాస్‌ ఎక్కువ. కాకపోతే ఇప్పుడు కొత్త టాక్స్‌ సిస్టమ్‌ అమల్లో వుండడంతో షేర్‌ తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఎనిమిది కోట్ల షేర్‌ వసూలు కాగా, బయటి నుంచి మరో కోటి వచ్చింది. బాలకృష్ణ, పూరి ఇద్దరికీ ఓవర్సీస్‌ మార్కెట్‌ అంత లేకపోయే సరికి ఈ చిత్రానికి బయటి నుంచి వసూళ్లు తగ్గాయి. మొదటి రోజు షేర్‌ బాగా వచ్చినప్పటికీ టాక్‌ ఆశాజనకంగా లేకపోవడం ఆందోళనకరం. ఈ చిత్రానికి బ్యాడ్‌ రివ్యూలతో పాటు పబ్లిక్‌ నుంచి కూడా మంచి రిపోర్ట్‌ లేదు. ఈ టాక్‌తో నిలదొక్కుకోవడం కష్టమే కానీ, ఈ వారంలో వున్న పాక్షిక సెలవులని వాడుకుని మంచి వసూళ్లు రాబడితే సేఫ్‌ అవడానికి ఆస్కారముంటుంది. పైసా వసూల్‌ తొలి రోజు వసూళ్ల వివరాలివిగో...

నైజాం:     1.6 కోట్లు

సీడెడ్‌:      1.8 కోట్లు

గుంటూరు: 1.54 కోట్లు

ఉత్తరాంధ్ర: 79 లక్షలు

కృష్ణ:     52 లక్షలు

వెస్ట్‌:      48 లక్షలు

ఈస్ట్‌:      70 లక్షలు

నెల్లూరు:     37 లక్షలు

మిగతావి:     90 లక్షలు

మొత్తం:     8.7 కోట్లు

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English