"న‌న్ను ఉరి తీయండి.. నాకు బ‌త‌కాల‌ని లేదు"

దేవుడా.. నేను చేసిన పాపం ఏంటి? దేవుడా.. నాకేమ‌వుతుంది? (రబ్బా.. మేరా క్యా క‌సూర్ హై.. ర‌బ్బా మేరా క్యా హోగా) అని అర్థం. ఈ మాట‌లు అన్న‌ది ఎవ‌రో కాదు...డేరా చీఫ్ గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్. రోహ్ త‌క్ జైలులో గుర్మీత్ పంజాబీలో త‌న‌లో తాను ఇలా మాట్లాడుకుంటున్నాడ‌ట‌. అంతే కాదు.. రోహ్‌త‌క్ లోని సున‌రియా జైలులో ఆయ‌న‌కు 20 ఏళ్ల‌ శిక్ష తీర్పు వ‌చ్చిన త‌ర్వాత ``న‌న్ను ఉరితీయండి.. నాకు బ‌త‌కాల‌ని లేదు`` అని డేరా చీఫ్ జ‌డ్జిని వేడుకున్నాడ‌ట‌.

డేరా చీఫ్ జైలులో పిచ్చోడ‌య్యాడ‌ట‌. జైలుకు వ‌చ్చిన త‌ర్వాత ఐదు రోజుల వ‌ర‌కు డేరా చీఫ్ ఏం తిన‌లేద‌ట‌. పాలు, టీ, బిస్కెట్లు త‌ప్పితే ఇంకా ఏం తిన‌లేద‌ట‌. ఇంకా.. జైలులో గుర్మీత్ కు వీఐపీ ట్రీట్ మెంట్ ఏం లేద‌ట‌. సాధార‌ణ ఖైదీల్లాగానే గుర్మీత్ నూ ట్రీట్ చేశార‌ట జైలు అధికారులు. జైలుకు వ‌చ్చిన త‌ర్వాత‌... ఆగ‌స్టు 28 న శిక్ష ఖ‌రారు చేసిన రోజు నైట్ అస్స‌లు నిద్ర‌పోలేద‌ట గుర్మీత్. ఈ విష‌యాల‌న్నీ చెప్పింది ఎవ‌రో కాదు.. సున‌రియా జైలు ఖైదీ స్వ‌దేశ్ కిరాద్.. గుర్మీత్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించాడు. ప్ర‌స్తుతం బెయిల్ పై విడుద‌లైన స్వదేశ్ గుర్మీత్ జైలులో ఎలా ప్ర‌వ‌ర్తించేవాడో తెలియ‌జేశాడు.

గుర్మీత్ కు తోటి ఖైదీలు ఉన్న గ‌ది కేటాయించి ఉంటే మాత్రం.. జైలులో ఉన్న తోటి ఖైదీలు ఆయ‌న‌పై దాడి చేసేవార‌ని స్వ‌దేశ్ చెబుతున్నాడు. గుర్మీత్ ను దోషిగా నిర్ధారించ‌గానే.. ఎన్నో అల్ల‌ర్లు జ‌రిగి చాలామంది చ‌నిపోవ‌డంతో గుర్మీత్ పై తోటి ఖైదీలు ఎంతో కోపంగా ఉన్నార‌ని స్వ‌దేశ్ కిరాద్ చెప్పుకొచ్చాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు