లెజెండ‌రీ హీరోయిన్ బ‌యోపిక్ లో విద్యా బాల‌న్?

లెజెండ‌రీ హీరోయిన్ బ‌యోపిక్ లో విద్యా బాల‌న్?

ప్ర‌స్తుతం బాలీవుడ్ లో బ‌యోపిక్, చారిత్ర‌క నేప‌థ్యం ఉన్న సినిమాల హ‌వా న‌డుస్తోంది. మారుతున్న ప్రేక్ష‌కుల అభిరుచిని బ‌ట్టి ద‌ర్శ‌క నిర్మాత‌లు ఈ త‌ర‌హా చిత్రాల‌ను నిర్మిస్తున్నారు. మంచి క‌థ‌నంతో రూపొందుతున్న బ‌యోపిక్ ల‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అదే ఊపులో బాలీవుడ్ లో అల‌నాటి అందాల తార మీనా కుమారి బ‌యోపిక్ ను నిర్మించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ట‌. కొద్ది రోజుల‌ క్రిత‌మే మీనాకుమారి పాత్ర‌లో కంగ‌నా రనౌత్ ను తీసుకోవాల‌నుకున్నార‌ట‌. అయితే, కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పించార‌ట‌. ప్ర‌స్తుతం మీనాకుమారి పాత్ర కోసం ఓ హీరోయిన్ ఓకే అయింద‌ని, త్వ‌ర‌లో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంద‌ని బాలీవుడ్ టాక్‌.
 
గ్లామ‌ర‌స్ హీరోయిన్ అయిన మీనాకుమారి కెరీర్లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్‌, క్లాసిక‌ల్ మూవీస్ తో పాటు ఆమె వ్య‌క్తిగ‌త జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులున్నాయి. అటువంటి లెజెండ‌రీ హీరోయిన్ బయోపిక్ ను తెరకెక్కించడానికి కొంతకాలం క్రితమే నిర్మాత‌లు రంగంలోకి దిగారట‌. అయితే, మీనా కుమారిగా లీడ్ రోల్ లో కంగనా రనౌత్ ఎంపిక పట్ల మీనా కుమారి సోదరుడు అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడ‌ట‌. దీంతో, ఆ ప్రాజెక్టు అట‌కెక్కింద‌ట‌ట‌. అయితే, మీనాకుమారి పాత్ర‌లో న‌టించేందుకు విద్యాబాలన్ ను సంప్రదిస్తున్నారట. ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ రావలసి ఉందని బాలీవుడ్ లో వినికిడి. డ‌ర్టీ పిక్చ‌ర్ లో త‌న న‌ట‌న‌తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను కూడా అందుకున్న విద్యా బాల‌న్...ఈ పాత్ర‌కు న్యాయం చేస్తుంద‌ని వారు భావిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం విద్యా బాల‌న్ గ్రీన్ సిగ్న‌ల్ కోసం నిర్మాత‌లు వెయిట్ చేస్తున్నార‌ట‌. మీనా కుమారి సోద‌రుడు, విద్యా బాల‌న్ అంగీక‌రిస్తే ఆ లెజెండ‌రీ హీరోయిన్ బ‌యోపిక్ త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్కుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు