తేజ డైరెక్ష‌న్లో మెగా హీరో?

తేజ డైరెక్ష‌న్లో మెగా హీరో?

టాలీవుడ్ కు ఉద‌య్ కిర‌ణ్, నితిన్‌, న‌వ‌దీప్‌, రీమాసేన్, స‌దా వంటి న‌టీన‌టుల‌ను ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుడు తేజ‌. ఒక‌ప్పుడు కొత్త ముఖాల‌తో కేవ‌లం క‌థాబ‌లాన్నే న‌మ్ముకొని తేజ హిట్ లు కొట్టేవాడు. స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలతో సినిమాలు చేసిన ప్రతీ సారి తేజ‌ ఫెయిల్ అయ్యాడు. అయితే, చాలాకాలం గ్యాప్ త‌ర్వాత రాణా లాంటి స్టార్ హీరోతో సినిమా చేసి ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు.

నేనే రాజు నేనే మంత్రితో హిట్ కొట్టిన తేజ ఇపుడు అదే త‌రహాలో మ‌రో స్టార్ హీరోతో త‌న సెక్స్ట్ మూవీ తీయ‌బోతున్న‌డ‌ని తెలుస్తోంది. ఈ సారి తేజ మెగా హీరోతో స‌రికొత్త క‌థ‌ను తెర‌కెక్కించ‌బోతున్నాడ‌ని టాలీవుడ్ టాక్. వ‌రుస ఫ్లాపుల‌తో ఇబ్బంది ప‌డుతున్న మెగా ఫ్యామిలీ హీరో వ‌రుణ్ తేజ్ ఫిదా తో బంప‌ర్ హిట్ అందుకున్నాడు. చాలాకాలం త‌ర్వాత నేనే రాజు నేనే మంత్రితో స‌క్సెస్ రుచి చూసిన తేజ‌, వ‌రుణ్ తేజ్ ల కాంబినేష‌న్ లో ఓ సినిమా రాబోతోంద‌ని వినికిడి. వరుణ్ తేజ్ హీరోగా ఓ ల‌వ్ స్టోరీని తెర‌కెక్కించేందుకు తేజ ప్లాన్ చేస్తున్నాడ‌ట.

వ‌రుణ్ తో చేయ‌బోయే సినిమాకు తేజ స్టోరీ రెడీ చేస్తున్నాడ‌ట‌. వరుణ్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత వ‌రుణ్  షార్ట్ గ్యాప్ తీసుకొని తేజ సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. ప్రస్తుతానికి ఈ కాంబినేషన్ పై మెగా ఫ్యామిలీ నుంచి ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English