బర్త్‌డే స్పెషల్‌ : 'రామయ్య' వచ్చేశాడు

బర్త్‌డే స్పెషల్‌ : 'రామయ్య' వచ్చేశాడు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మరోసారి టీజర్‌తోనే తన సత్తా చాటేశాడు. తన పుట్టిన రోజు సందర్భంగా దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ఇచ్చిన 'రామయ్య వస్తావయ్యా' టీజర్‌ గిఫ్ట్‌ అదిరిపోయింది. ఇన్ని రోజులూ నందమూరి అభిమానులు ఎన్టీఆర్‌ను పవర్‌ఫుల్‌గా, కలర్‌ఫుల్‌గా ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూపించాడు. అదిరిపోయే లుక్‌తో వచ్చిన ఈ టీజర్‌లో ఒక డైలాగు అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ''ఎవడుపడితేవాడు బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడతీసి కొడతా. అలా అనాలంటే ఒక అర్హతుండాలి, లేకపోతే నా అభిమానై ఉండాలి''

సింపుల్‌గా బుడ్డోడు అనే పద్దానికి ఉన్న పవర్‌ఫుల్‌ ఫ్లాష్‌బ్యాక్‌ను చెప్పినట్టు ఉంది కదూ. లైవ్‌లీ మ్యూజిక్‌, సమంత, శృతిహాసన్‌ ఇద్దరూ లవ్‌లీ హీరోయిన్స్‌, పైగా గ్రేస్‌తో కూడిన ఎన్టీఆర్‌ మాస్‌ స్టెప్పులు వెరసి ఈ ట్రైలర్‌ను అద్భుతమైన పుట్టినరోజు కానుకగా చేస్తున్నాయి. ఇక ఎన్టీఆర్‌ అభిమానులు ఆనందానికి హద్దులు లేవుగాని, మీరు ఆ ట్రైలర్‌పై త్వరగా ఒక లుక్కేసేయండి!!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English