నితిన్‌కి లై ఎక్స్‌పీరియన్స్‌ రిపీట్‌

నితిన్‌కి లై ఎక్స్‌పీరియన్స్‌ రిపీట్‌

'లై' చిత్రంతో దారుణమైన డిజాస్టర్‌ చవిచూసిన నితిన్‌ ఇప్పుడిప్పుడే ఆ పరాభవం నుంచి కోలుకుని తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టాడు. ఇష్క్‌తో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసిన తర్వాత నితిన్‌ చాలా కేర్‌ఫుల్‌గా తన సినిమాలు ప్లాన్‌ చేసుకుంటూ వస్తున్నాడు. ఒకటీ అరా చిత్రాలు ఆశించిన విజయాలు సాధించకపోయినా కానీ కమర్షియల్‌గా లై స్థాయిలో ఏవీ డిజాస్టర్‌ కాలేదు.

'అ ఆ'తో తన మార్కెట్‌ పెరిగిందని అనుకుంటూ వుంటే 'లై'తో ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. తన తదుపరి చిత్రానికి త్రివిక్రమ్‌ కథ అందించడం, పవన్‌కళ్యాణ్‌ నిర్మాణ భాగస్వామి కావడంతో నితిన్‌కి దీనిపై ఆశలు బాగానే వున్నాయి. అయితే ఈ చిత్రాన్ని 'లై' జ్ఞాపకాలు వెంటాడబోతున్నాయి.

యుఎస్‌లో ఎక్కువ భాగం షూటింగ్‌ జరుపుకున్న లై చిత్రంలానే ఇది కూడా అమెరికాలో ముప్పయ్‌ అయిదు రోజుల పాటు షూటింగ్‌ చేసుకోనుంది. ఇందులో కూడా లై చిత్రంలో హీరోయిన్‌గా నటించిన మేఘా ఆకాష్‌ నటిస్తోంది. అమెరికాలో సుదీర్ఘమైన షెడ్యూల్‌ కోసం పాపులర్‌ హీరోయిన్‌ డేట్స్‌ దొరకవని 'లై' కోసం మేఘా ఆకాష్‌ని తీసుకున్నారు.

ఇప్పుడీ చిత్రానికి కూడా అదే కారణం మీద మేఘా ఆకాష్‌కి ఛాన్స్‌ ఇచ్చారు. అయితే ఇదంతా 'లై'కి ముందే ఫిక్స్‌ అయిపోయింది. తీరా లై ఏమో భారీ ఫ్లాప్‌ అయి ఈ చిత్రానికి బ్యాడ్‌ సెంటిమెంట్‌గా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు