సునీల్ కోసం దిల్ రాజు ముందుకొచ్చాడు

సునీల్ కోసం దిల్ రాజు ముందుకొచ్చాడు

కమెడియన్ సునీల్ అంటే దిల్ రాజుకు చాలా అభిమానమున్నట్లే ఉంది. అతణ్ని పెట్టి 'కృష్ణాష్టమి' లాంటి భారీ బడ్జెట్ సినిమాను నిర్మించాడు రాజు. ఆ సినిమా రాజుకు చాలా నష్టాలే మిగిల్చింది. ఇప్పుడు సునీల్ కోసం మరో సాయం చేయడానికి ముందుకొచ్చాడు రాజు. సునీల్ కొత్త సినిమా 'ఉంగరాల రాంబాబు' కోసం రాజు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడట.

ఈ సినిమా ఆరంభ సన్నివేశాల్లో హీరో పాత్రను పరిచయం చేయడానికి దర్శకుడు క్రాంతి మాధవ్ దిల్ రాజు సాయం తీసుకున్నాడట. ఇటీవలే రాజు ఈ సినిమాకు వాయిస్ ఓవర్ పని పూర్తి చేశాడట. మామూలుగా ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చే బాధ్యత స్టార్ హీరోలు తీసుకుంటుంటారు. ఇలా ఓ నిర్మాత వాయిస్ ఇవ్వడం అన్నది అరుదైన విషయం. ఇందుకు రాజు ఒప్పుకోవడమూ విశేషమే. రాజు వాయిస్ అయితే భిన్నంగా ఉంటుందని ఇలా ట్రై చేశాడట దర్శకుడు క్రాంతి మాధవ్.

'ఉంగరాల రాంబాబు' ఎప్పుడో విడుదలకు సిద్ధమైనప్పటికీ అనుకున్న స్థాయిలో బిజినెస్ జరక్క.. డబ్బింగ్ పని పెండింగ్‌లో ఉండటం వల్ల విడుదల ఆలస్యమవుతూ వస్తోంది. చివరికి సెప్టెంబర్ మధ్యలో ఎలాగైనా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలన్న ప్రయత్నంలో ఉన్నాడు నిర్మాత పరుచూరి కిరీటి. సునీల్ గత మూణ్నాలుగేళ్లలో నటించిన సినిమాలన్నీ తేడా కొట్టేశాయి. అతడి చివరి సినిమా 'ఈడు గోల్డ్ ఎహే' అడ్రస్ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే 'ఉంగరాల రాంబాబు'పై ట్రేడ్ వర్గాల్లో, ప్రేక్షకుల్లో అంత ఆసక్తి కనిపించడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు