హృతిక్ పై కంగ‌నా షాకింగ్ కామెంట్స్‌?

హృతిక్ పై కంగ‌నా షాకింగ్ కామెంట్స్‌?

క్వీన్ సినిమాతో బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ కెరీర్ స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ తో కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్ట‌వ‌చ్చ‌ని కంగ‌నా ఆ సినిమాతో నిరూపించింది. ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందుకుంది. అయితే, సినిమాల‌తో పాటు మ‌రికొన్ని వివాదాల‌లో కూడా కంగ‌నా పేరు వినిపిస్తోంది.
త‌న అభిప్రాయాల‌ను నిర్మొహ‌మాటంగా వెల్ల‌డించి వివాదాల‌కు కేంద్ర బిందువ‌వ‌డం కంగ‌నాకు అల‌వాటు. తాజాగా, బాలీవుడ్ హీరో  హృతిక్ రోష‌న్ పై ఇన్ డైరెక్ట్ గా కాంట్ర‌వ‌ర్షియ‌ల్ కామెంట్స్ చేసింది కంగ‌నా. హృతిక్‌ త‌న‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ ఓ టీవీ షోలో పాల్గొన్న సంద‌ర్భంగా కంగ‌న వ్యాఖ్యానించింది.

కంగ‌నా మాట‌లు హృతిక్‌ని ఉద్దేశించి అన్న‌వేన‌ని అంద‌రూ భావిస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ ప్రోమోలో కంగ‌నా ఇన్ డైరెక్ట్ గా హృతిక్‌ని కామెంట్ చేసింది. `అత‌డిని ఇక్క‌డికి పిల‌వండి. ప్ర‌తి ప్ర‌శ్న‌ను అత‌డిని అడ‌గండి. మొద‌ట నోటీసు పంపింది నేను కాదు. అంత నీతిమాలిన ప‌ని నేను చేయ‌లేదు. ఆ నోటీసు వ‌ల్ల రాత్రిళ్లు నాకు నిద్ర‌ప‌ట్టేది కాదు. ఒత్తిడి, మాన‌సిక వేద‌న వ‌ల్ల ఎంతో న‌ర‌క‌యాత‌న అనుభ‌వించాను.

డిప్రెష‌న్ లోకి వెళ్లిపోయాను. నా పేరు మీద అతడు మెయిల్స్ కూడా విడుద‌ల చేశాడు. ఇప్ప‌టికీ వాటిని గూగుల్ చేసి మ‌రీ జ‌నాలు చ‌దివి, నా మీద జోకులు వేస్తున్నారు. న‌న్ను ఇంత‌ ఇబ్బందికి గురి చేసినందుకు అత‌డు నాకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి` అని కంగ‌నా అంది. ఈ వ్యాఖ్య‌ల‌కు రిటార్ట్ గా అన్న‌ట్లు... హృతిక్ ఓ ట్వీట్ చేశాడు. `మీడియా చెబుతున్న మ‌హిళ‌తో కంటే పోప్‌తో డేట్ చేయ‌డానికి నేను సిద్ధంగా ఉంటాను` అంటూ కంగ‌నాను ఉద్దేశించి హృతిక్ ట్వీట్ చేశాడు. దీంతో, వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ ముదిరి పాకాన ప‌డిన‌ట్ల‌యింది.

ఆషికీ-3 లో హృతిక్ రోష‌న్ కు జంట‌గా కంగ‌నా ర‌నౌత్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు నిర్మాత‌లు. అయితే, త‌న‌కు కంగ‌నాతో ప‌నిచేయ‌డం ఇష్టం లేద‌ని హృతిక్ తేల్చి చెప్పాడు. దీంతో, నిర్మాత‌లు కంగ‌నాను ఆ సినిమా నుంచి త‌ప్పించారు. దీంతో, హృతిక్ ను ఉద్దేశించి ఇన్‌ డైరెక్ట్ గా సిల్లీ ఎక్స్ ఇటువంటి ప‌నులే చేస్తుంటారు..... అంటూ కంగ‌నా కామెంట్ చేసింది. దానికి ఘాటుగా స్పందించిన హృతిక్‌....కంగ‌నాను క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌మ‌ని కోరాడట. దానికి కంగ‌నా ఒప్పుకోలేద‌ట‌. ఈ ర‌కంగా వారిద్ద‌రి మ‌ధ్య మొద‌లైన వివాదం చినికి చినికి గాలివాన‌గా మారిందని బాలీవుడ్ టాక్‌. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో హృతిక్ , కంగ‌నాలు ఒక‌రి పేరు ఒక‌రు ప్ర‌స్తావించ‌కుండా కామెంట్లు చేయ‌డం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు